ED, IT Raids: టీఆర్ఎస్ ఎంపీ ఆఫీస్‍లో ఈడీ, ఐటీ అధికారుల తనిఖీలు..
హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ,ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ లోని టీఆర్ఎస్ రాజ్యసభ వద్దిరాజ్ రవిచంద్ర కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 11 గంటలుగా సొదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు చేశాయి. కరీంనగర్, హైదరాబాద్ లో ఏకాలంలో ఈ సోదాలు చేశారు. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేశారు. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు చేశారు.
గంగుల కమలాకర్
కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ తనిఖీలు చేశారు. ఏకకాలంలో రెండు చోట్ల 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.













Click it and Unblock the Notifications