హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. రంగంలోకి 50కిపైగా బృందాలు.. టార్గెట్ ఎవరంటే!!

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం కొనసాగుతుంది. రంగంలోకి 50కిపైగా బృందాలు దిగి హైదరాబాద్ వ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్లో ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి మీద, ఏ సమయంలో ఏం దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు, రాజకీయ వర్గాలు ఐటి, ఈడి, సిబిఐ దాడులతో వణికిపోతున్నారు. ఇక తాజాగా మరో మారు హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా మళ్ళీ ఐటీ దాడులు.. టార్గెట్ కంపెనీ ఇదే

హైదరాబాద్ కేంద్రంగా మళ్ళీ ఐటీ దాడులు.. టార్గెట్ కంపెనీ ఇదే

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వసుధ గ్రూప్ సంస్థల ఆఫీసులలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటుగా పలుచోట్ల ఐటీ సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల ప్రస్తుతం ఐటి సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని మాదాపూర్, ఎస్సార్ నగర్, జీడిమెట్ల లోని కంపెనీ కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 50 కి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చైర్మన్

ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చైర్మన్

వసుధ గ్రూప్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఇళ్లల్లో కూడా ఐటి దాడులు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకటరామ రాజు ఇంట్లోనూ, కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మా తో పాటు చైర్మన్ వెంకట రామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తేలింది.

ఆధారాలతో దాడులు చేస్తున్న ఐటీ అధికారులు

ఆధారాలతో దాడులు చేస్తున్న ఐటీ అధికారులు


గతంలో అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు జరిపిన ఐటి అధికారులు, చాలా కంపెనీలకు చెందిన పెట్టుబడుల విషయంలో ఆధారాలను సేకరించారు. ఇక వీటి ఆధారంగా ప్రస్తుతం ఐటీ అధికారులు హైదరాబాద్లో 50 టీంలుగా విడిపోయి దాడులు కొనసాగిస్తున్నారు. వెంగళరావు నగర్ లో రెండు టీంలు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీంలు ప్రస్తుతం సోదాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవో తదితరులు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణాలో ఐటీదాడులతో కలకలం

తెలంగాణాలో ఐటీదాడులతో కలకలం


గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా గ్రానైట్ కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వంటి అనేక వ్యవహారాలలో వేర్వేరు సందర్భాలలో మంత్రులు, వ్యాపారవేత్తలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనేకమందికి నోటీసులు ఇచ్చి వారిని విచారించారు. ఇక తాజాగా మరో మారు ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులతో తెలంగాణలో మళ్లీ దాడుల కలకలం కొనసాగుతుంది.

కోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్‌రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ!!కోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్‌రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ!!

English summary
Once again IT officials doing raids in Hyderabad. Around 50 teams are divided and searches are being conducted in the houses of the Chairman, CEO, Directors and Managing Directors of Vasudha Pharma Chem Limited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X