హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. 20 చోట్ల.. ఈసారి టార్గెట్ ఎవరంటే!!

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం కొనసాగుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి.

హైదరాబాద్లో ఐటీ సోదాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి మీద, ఎలా దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు, రాజకీయ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతుంటే, బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ కావాలనే ఐటీ దాడులు చేయిస్తుందని మండిపడుతున్నారు. ఇక తాజాగా మరో మారు హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ సంస్థలే లక్ష్యంగా 20చోట్ల ఐటీ దాడులు..

రియల్ ఎస్టేట్ సంస్థలే లక్ష్యంగా 20చోట్ల ఐటీ దాడులు..

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఒకేసారి 20 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై, రాజకీయ ప్రముఖుల నివాసాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు మళ్లీ రియల్ ఎస్టేట్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ లోని గూగి ప్రాపర్టీస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

ఐటీ అధికారుల దాడులకు కారణం ఇదే

ఐటీ అధికారుల దాడులకు కారణం ఇదే

ఐదు బృందాలతో గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో దాడులు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. అంతేకాక ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పైన కూడా ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలు, చెల్లిస్తున్న ఆదాయపన్నుకు మధ్య వ్యత్యాసం ఉండడంతో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లుగా సమాచారం

 గతంలోనూ ఏకకాలంలో 50 చోట్ల ఐటీ సోదాలు

గతంలోనూ ఏకకాలంలో 50 చోట్ల ఐటీ సోదాలు


గతంలో కూడా పలుమార్లు హైదరాబాదులోని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటి దాడులు కొనసాగాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వసుధ గ్రూప్ సంస్థల ఆఫీసులలో ఐటీ సోదాలు జరిగాయి.వసుధ ఫార్మాకెమ్ లిమిటెడ్ తో పాటుగా పలుచోట్ల ఐటీ సోదాలను కొనసాగించిన ఐటీ అధికారులు అప్పుడు మొత్తం 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు.హైదరాబాద్లోని మాదాపూర్,ఎస్సార్ నగర్,జీడిమెట్ల లోని కంపెనీ కార్యాలయాలలో ఐటీ దాడులు నిర్వహించారు.50 కి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు దాడులు కొనసాగించారు.

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంటిపైనా ఐటీ దాడులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంటిపైనా ఐటీ దాడులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంటి పైన, రాజ పుష్ప, వసుధ, వర్టేక్స్, ముప్పా సంస్థల పైన దాడులు జరిపిన ఐటీ అధికారులు దాదాపు 50 బృందాలుగా తనిఖీలలో పాల్గొంన్నారు. అప్పుడు ఐటి అధికారులు రామచంద్రపురం సమీపంలోని తెల్లాపూర్ లో రాజ పుష్ప లైఫ్ స్టైల్ కాలనీలో నివాసం ఉంటున్న సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో తనిఖీలు జరిపారు. కాలనీ గేట్లు మూసివేసి మరీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలను నిర్వహించారు ఐటీ అధికారులు. ఇప్పుడు మరోమారు ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈసారి టార్గెట్ ఎవరు అన్న చర్చ జరుగుతుంది. వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+