తెలంగాణకు తాగుబోతు సిఎం కావడం దురదృష్టకరం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు తాగుబోతు ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు.
మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం సిగ్గుచేటని ఆయన మండి పడ్డారు. ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫమయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎన్నికల హామీలపై వరంగల్‌లో ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమని బీజేపీ నేత కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిదే గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ అహంకారానికి ఓటమి తప్పదని ఆయన అన్నారు. పత్తి రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్యాంట్‌లు వేసుకుంటే రైతులు కాదా, ప్యాంట్‌లు వేసుకుని మీరు ఫాంహౌస్‌లో వ్యవసాయం చేయడం లేదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications