వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mallareddy: మంత్రి మల్లారెడ్డితో సహా 16 మంది డైరెక్టర్లకు ఐటీ నోటీసులు..

|
Google Oneindia TeluguNews

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ నెల 22 నుంచి 24 వరకు 50కి పైగా ఐటీ బృందాలు సోదాలు చేశాయి. మల్లారెడ్డి గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బ్లాక్‌‌మనీని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించినట్లు తెలిసింది.

నగదు రూపంలో

నగదు రూపంలో

అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని వివరించారు. మంత్రికి చెందిన16కు పైగా కంపెనీల్లో జరిపిన తనిఖీల్లో రూ.వందల కోట్ల హవాలా ట్రాన్సాక్షన్స్‌‌ గుట్టు తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి సహా సంబంధిత కంపెనీలకు చెందిన 16 మంది డైరెక్టర్లకు గురువారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

28, 29వ తేదీల్లో

28, 29వ తేదీల్లో


ఈ నెల 28, 29వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలని కోరింది. ఆర్థిక లావాదేవీలకు చెందిన పత్రాలను తీసుకురావాలని ఆదేశించింది. మరోవైపు స్వాధీనం చేసుకున్న హవాలా ట్రాన్సాక్షన్స్ ఆధారాలతో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)కి ఐటీ శాఖ లేఖ రాసే అవకాశం ఉంది. ఈ సోదాల్లో హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి


అయితే సోదాల క్రమంలో కొంత హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రి సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొందుతున్న మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి వద్ద ఐటీ అధికారులు సంతకాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అర్ధరాత్రి 12 గంటలకు హుటాహుటిన ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సూరారంలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన కొడుకు మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వద్ద బల వంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు.

మల్లారెడ్డిపై కేసు

మల్లారెడ్డిపై కేసు


దీనిపై మంత్రి రాత్రి 2.30గంటల టైంలో ఐటీ అధికారి రత్నాకర్‌పై బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు, సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో కలిసి బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌కి చేరుకున్నారు. మరో వైపు తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోదాల సమయంలో తన ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ను మాయం చేశారని, అసభ్యకర పదజాలంతో దూషించారని తెలిపారు. ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై 342, 353, 201, 504, 506, 353, 379 R/W 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌

ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌


ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి పోలీసులు కోరారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. తన అనుచరులతో ఓ ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్ పంపించారు. అయితే అది తమది కాదని ఐటీ అధికారి ఐటీ అధికారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వేరే ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ తెచ్చారని, తమ ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లో విలువైన సమాచారం ఉందని చెప్పారు. మల్లారెడ్డి అనుచరులు తీసుకొచ్చిన ల్యాప్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ తీసుకునేందుకు నిరాకరించారు. తర్వాత 3.30 టైంలో మరో ఇద్దరు కార్యకర్తలు డెల్‌‌‌‌‌‌‌‌ ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ను తీసుకువచ్చారు. అయితే ఆ ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ను ఐటీ అధికారులు తీసుకోలేదు. పథకం ప్రకారమే ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ను తారుమారు చేశారని పోలీసులకు చెప్పారు.

కేసీఆర్ ముందే చెప్పారు

కేసీఆర్ ముందే చెప్పారు


గురువారం మంత్రి మల్లారెడి ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. కేంద్ర బలగాలతో మాపై పెద్దఎత్తున దాడులు చేశారని ఆరోపించారు. మమ్మల్నేకాదు కేసీఆర్ ను కూడా ఏం చేయలేరు అన్నారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల్ లో అక్రమాలు జరిగాయని చెబుతున్నారని.. మెడికల్ సీట్లకు డొనేషన్లు తీసుకోలేదని మంత్రి చెప్పారు. ఐటీ దాడులు ఉంటాయని కేసీఆర్ ముందే చెప్పారని మల్లారెడ్డి తెలిపారు. కాగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే దాడులు జరుగుతున్నాయని అన్నారు. తాము చట్ట ప్రకారం ట్యాక్స్ కడుతున్నామని చెప్పారు. పార్టీ మారాలనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


మంత్రి మల్లారెడ్డిపై గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపై ఈడీ,ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఉండే కానీ.. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో కేంద్రంపై కేసీఆర్ కాలు దువ్వుతున్నారు. మరో కేంద్రం కూడా కేసీఆర్ ను అష్టదిగ్భంధనం చేసే ప్రయత్నం చేస్తుంది.

ఐటీ,ఈడీ, సీబీఐ

ఐటీ,ఈడీ, సీబీఐ


ఈ దిశగా టీఆర్ఎస్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ భారీగా ఆస్తులున్న వారిని కేంద్రం టార్గెట్ చేసింది. వారిపై ఐటీ, ఈడీలను ప్రయోగిస్తుంది.

English summary
On Thursday, IT department issued notices to 16 directors of related companies including Minister Mallareddy. They asked him to appear before them on 28th and 29th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X