వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mallareddy: మల్లారెడ్డి మెడికల్ సీట్లు అమ్ముకున్నాడు..! ఎంపీ అర్వింద్ ఆరోపణ..

|
Google Oneindia TeluguNews

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు, కార్యాలయాలు, యూనివర్సిటీ, కాలేజీలు, అతని కొడుకు, అల్లుడి ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు దాదాపు 7 గంటలుగా సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు 50 బృందాలుగా విడిపోయి ఉదయం 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు.

రాజేశ్వర్ రావు

రాజేశ్వర్ రావు

అయితే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు క్రాంతి బ్యాంక్ ద్వారా జరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. బాలానగర్ రాజు కాలనీలో సీఆర్పీఎఫ్ బలగాల పహరాలో ఈ తనిఖీలు సాగుతోన్నాయి. మల్లారెడ్డి సోదరుడి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గోపాల్ రెడ్డి

గోపాల్ రెడ్డి

మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. తాళాలు లేవని చెప్పడంతో బీరువాలు, లాకర్లను అక్బర్ అనే వ్యక్తితో ఓపెన్ చేయించినట్లు సమాచారం. మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఫోన్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎవరిని బయటకు పంపించడం కానీ బయటి వ్యక్తులను లోపలికి పంపించడం లేదు.

4 మెడికల్ కాలేజీలు

4 మెడికల్ కాలేజీలు


మల్లారెడ్డి ఫోన్ చాలా సేపటి తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మల్లారెడ్డి యూనివర్సిటీతోపాటు అనేక కాలేజీలు ఉన్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డికి 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 4 మల్లారెడ్డి మెడికల్ కాలజీల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశిలీస్తున్నారు. అలాగే 14 విద్యాసంస్థల్లోనూ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ దాడులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.

మెడికల్ సీట్లు


మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు సీట్లు అమ్ముకున్నారని అర్వింద్ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా అర్వింద్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మల్లారెడ్డి తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో పెట్టిన సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.
పెట్టి దాచిన సిబ్బంది.

English summary
The IT department is conducting inspections at the house of Kranti Bank Chairman Rajeshwar Rao. These checks are going on under the watch of CRPF forces in Balanagar Raju Colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X