హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి మల్లారెడ్డిపై ఐటీకి ఉప్పందించెదవరు..!!

|
Google Oneindia TeluguNews

మంత్రి మల్లారెడ్డిపైన ఐటీ దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రెండు రోజులుగా టీంలు ఏర్పడి మరీ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో ఏం దొరకలేదని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. ఐటీ అధికారులు తమను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదంతా బీజేపీ రాజకీయల్లో వేధింపుల్లో భాగంగా చేస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, ఐటీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పక్కా సమాచారంతోనే సోదాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ మంత్రులే లక్ష్యంగా
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి పై ఐటీ దాడులు సంచలనంగా మారాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలను అప్రమత్తం చేసారు. ఐటీ - ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. మీ ఫోన్లు పైన నిఘా ఉందంటూ పార్టీ నేతలను హెచ్చరించారు. ఇక, ఇప్పుడు సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. మల్లారెడ్డి ఇంటితో పాటుగా ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థలు..బంధువుల ఇళ్లు - కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ 8.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

IT rides on Minister Mallareddy:Who was the person who leaked the info to IT,Here is all

పక్కా వ్యూహాత్మకంగా ఐటీ దాడులు
దాదాపు 50 బృందాలు మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా సోదాలు చేస్తున్నాయి. అయితే, అదాయపు పన్ను అధికారులు ముందస్తుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నట్లుగా అర్దం అవుతోంది. పూర్తి సమాచారం రాబట్టిన తరువాతనే ఎవరెవరు మల్లారెడ్డి సన్నిహితులు ఆర్దిక లావాదేవీలతో సంబంధాలు ఉన్నారనేది స్పష్టత వచ్చిన తరువాతనే ఈ సోదాలు ప్రారంభించారు. అందులో భాగంగా.. మల్లారెడ్డి ఆర్ధిక వ్యవహారాలు చూసే వ్యక్తులు మొదలు..దూరపు బంధువుల నివాసాలకు ఐటీ అధికారులు నేరుగా వెళ్లారు. తొలుత దాడులు చేసి సేకరించిన సమాచారం మేరకు మరి కొందరి పైన దాడులు చేయటం సాధారణంగా జరిగే విషయం.

IT rides on Minister Mallareddy:Who was the person who leaked the info to IT,Here is all

ముందస్తు సమాచారంతోనే సోదాలు
కానీ, ఇక్కడ మల్లారెడ్డి కుటుంబ సభ్యుల రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాముల వద్దకు ఐటీ అధికారులు నేరుగా వెళ్లారు. కొద్ది నెలల క్రితమే రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుల తరహాలో ఐటీ అధికారులు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. భిన్న మార్గాల్లో సమాచారం సేకరించి.. ఎంపిక చేసిన వ్యక్తుల మీదనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులు తన కుమారుడని ఐటీ అధికారులు కొట్టారని ఆరోపించారు. కేంద్రం తమ పైన ఐటీ దాడులు చేయిస్తోందంటూ మండి పడ్డారు. సోదాలు కొనసాగుతున్న నివాసాలు - కార్యాలయాల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు.

IT rides on Minister Mallareddy:Who was the person who leaked the info to IT,Here is all
English summary
AS per reports IT officials raids on Minister Mallareddy house and offices with perfect planning, still raids in on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X