మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు కేసీఆర్ ను చంద్రబాబు ఆడుకుంటారు - ఛాన్స్ వదులుకోరు : కాంగ్రెస్..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో ఏపీలో ఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటు చంద్రబాబు తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం అంటూ అడుగులు వేస్తున్నారు. దీంతో, ఇద్దరు చంద్రుల రాజకీయ రూటు మారింది. చంద్రబాబు ఖమ్మం సభలో తెలంగాణకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ డెవలప్ మెంట్ గురించి వివరించారు.

తెలంగాణలో పార్టీని వీడిన నేతలు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. దీని పైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసమే తెలంగాణలో తిరిగి రాజకీయం మొదలు పెట్టారని ఆరోపించారు.

చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్

చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్

ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ రాజకీయం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. టీడీపీకి తెలంగాణలో ఇప్పుడు ఎంట్రీ దొరికిందన్నారు. సెంటిమెంట్ ను వాడుకుంటూ కేసీఆర్ ఇన్ని రోజులు అడ్డుకున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో పార్టీ పని చేసిన నేతలను తిరిగి రావాలని ఆహ్వానించటంలో తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ తిరిగి తెలంగాణలో బతికే ఛాన్స్ కేసీఆర్ ఇచ్చారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ అవకాశం వదులుకోరన్నారు. చంద్రబాబు పైన ఎంత మంది మంత్రులు ఆరోపణలు చేసినా లాభం లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

చంద్రబాబు అసలు లక్ష్యం అదేనా

చంద్రబాబు అసలు లక్ష్యం అదేనా

చంద్రబాబు ఖమ్మం సభలో బీఆర్ఎస్..బీజేపీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు పైన ఆరోపణలు చేసినా..ఆ పార్టీ నేతలు స్పందించలేదు. బీజేపీతో పొత్తు దిశగా చంద్రబాబు తెలంగాణ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణల పైన బీజేపీ నుంచీ స్పందన లేదు. ఏపీలో 2014 తరహాలో పొత్తులను రిపీట్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ నేతలు తిరిగి వస్తే ఇప్పుడు పూర్వ వైభవం దిశగా సాధ్యమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలంగాణలో మరి కొన్ని ప్రాంతాల్లో సభలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాలిస్తున్నాయి.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

మారుతున్న రాజకీయ సమీకరణాలు

చంద్రబాబు ఇప్పుడు అసలు లక్ష్యం ఏపీలో అధికారం దక్కించుకోవటం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోరు మారింది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది.

2018లో టీడీపీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవటం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. నాడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకొని చంద్రబాబు దెబ్బ తిన్నారనే అభిప్రాయం ఉంది. కానీ, ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రయోజనాల దిశగానే తెలంగాణలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయమూ వినిపిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిని పెంచుతోంది.

English summary
TPCC Working President interesting comments on Chandra Babu re entry in Telangana Politics, says TDP will Utilise the option.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X