సత్తా చూపిస్తాం, పచ్చి అవకాశవాది: కెసిఆర్‌పై విరుచుకుపడిన జైపాల్

Subscribe to Oneindia Telugu

మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ పచ్చి అవకాశవాదని ధ్వజమెత్తారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే కాదు, రాస్ట్రంలో ఏ వర్గానికి కూడా దక్కలేదని అన్నారు. అసలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి విధివిధానాలే లేవని ధ్వజమెత్తారు.

Jaiapl Reddy lashes out at KCR

2013 నాటి భూసేకరణ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం అమలు చేయకుంటే నిరసనలు చేపడతామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లినవాళ్లందరూ అవకాశవాద రాజకీయన నేతలేనని మండిపడ్డారు. వచ్చే రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని జైపాల్ రెడ్డి అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Senior leader Jaiapl Reddy on Thursday lashed out at Telangana CM K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి