ట్రావెల్స్ దుమారం: జేసీ సవాల్‌తో ఆర్టీఏకు శ్రీనివాస్ గౌడ్, జేసీ అరెస్ట్

తెలంగాణలో ప్రైవేటు బస్సుల అంశంలో ఏపీ టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

హైదరాబాద్: ప్రైవేటు బస్సుల అంశంపై ఇప్పుడు రాజకీయం దుమారం రేగుతోంది. తెలంగాణలో ప్రైవేటు బస్సుల అంశంలో ఏపీ టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాగా, శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలో నిజం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ఆరోపణలు రుజువు చేసేందుకు ఆర్టీఏ ఆఫీసు వద్దకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీనివాస్ గౌడ్‌కు సవాల్ విసిరారు. జేసీ సవాల్ స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్.. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో కలిసి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అన్ని ఆధారాలున్నాయి.. కాబట్టే ఆరోపించానని అన్నారు.

JC Prabhakar Reddy Vs TRS Srinivas Goud Over Private Travels Buses


నేనూ తెలంగాణ ఆపరేటరే: జేసీ ప్రభాకర్ రెడ్డి, అరెస్ట్

ఈ క్రమంలో ఆర్టీఏ ఆఫీసు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీఏ ఆఫీసుకు చేరుకోగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అవకతవకలు ఏమీ చోటు చేసుకోలేదని, చర్చించేందుకే తాను వచ్చానని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా తాము ట్రావెల్స్ నడపడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

తమ వాహనాలకు పర్మిట్ ఉన్నాయని తెలిపారు. తాను కూడా తెలంగాణ ఓనరేనని జేసీ చెప్పారు. తాను అన్ని ఆధారాలతో ఆర్టీఏ కార్యాలయానికి వస్తే.. తనను అరెస్ట్ చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాగా, గొడవలు జరిగే అవకాశం ఉన్నందునే జేసీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆధారాలు చూపమన్నారు, తెచ్చాం: శ్రీనివాస్ గౌడ్

పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. స్టేజి క్యారియర్ల పేరుతో ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తేల్చుకోవడానికి ఆయన మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, అనుచరులతో కలిసి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం జరుగుతోందని శ్రీనివాస్ గౌగ్ అన్నారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని, ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని, అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని తెలిపారు.

పాలెం బస్సు దుర్ఘటనలో కూడా ఆయనదే నేరమని ఆరోపించారు. బస్సు తనది కాదని చెప్పడానికి పాత తేదీతో అమ్మినట్లు కూడా పత్రం ఉందని, డిసెంబర్ నెలలో స్టాంప్ పేపర్ కొని.. అక్టోబర్‌లో సంతకం చేసినట్లు చూపించారని తెలిపారు. అలాగే తక్కువ సీట్లకు పర్మిట్ తీసుకుని ఎక్కువ సీట్లతో నడిపిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రా ట్రావెల్స్ అనే తేడా లేదని, తెలంగాణ ట్రావెల్స్ అవకతవకలకు పాల్పడినా కేసులు నమోదు చేయాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము మొదట దివాకర్ ట్రావెల్స్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదని, పలు ట్రావెల్స్ గురించి మాట్లాడితే.. జేసీ ఒక్కరే స్పందించారని అన్నారు. జేసీని అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

కొత్త బస్సుల కొనుగోలు చేయడానికి తెలంగాణ ఆర్టీసికి సీఎం కేసీఆర్.. రూ. 1000కోట్లు కేటాయించారని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వాహనాలను ఏపీలో ఆపుతున్నారని అన్నారు. అక్రమంగా ట్రావెల్స్ నడుపుతున్న వారిపై ఏపీలో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏపీ నుంచి వచ్చే బస్సులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే.. ఇక్కడ్నుంచి వెళ్లే బస్సులకు ఏపీ నిలబడేందుకు కూడా వీలు కల్పించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. విశాఖలో ఇలాంటే ఘటనే ఇటీవల చోటు చేసుకుందని అన్నారు. ఏపీ నుంచి 50శాతం బస్సులు ఇక్కడకు వస్తే.. తెలంగాణ నుంచి కూడా 50శాతం వెళ్తాయని, అన్ని వాహనాలను కూడా ఇలాగే చేయాలని అన్నారు. ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+