వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"హరీశ్ రావు ఎక్కడ సీఎం అవుతాడోనని కేసీఆర్ భయం!"

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు కాకుండా అల్లుడైన చంద్రబాబు సీఎంగా మారారని, ప్రస్తుతం కేటీఆర్ సీఎం కాకుండా హరీశ్ రావు ఎక్కడ సీఎం అయిపోతారేమోననే భయంలో తెలంగాణ సీఎం ఉన్నారని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

టీపీసీసీ నేత‌లంతా రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్ ను కలిసిన సందర్బంలో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ చేపడుతున్న కొత్త సచివాలయ నిర్మాణంపై తమ అభ్యంతరాలను గవర్నర్ తో తెలిపారు టీపీసీసీ నేతలు. కొత్త సచివాలయాన్ని నిర్మించకూడకుండా చూడాలని గవర్నర్ ను కోరారు. కేవలం వాస్తును అడ్డుపెట్టుకుని తెలంగాణ సర్కార్ భవనాల కూల్చివేతకు పాల్పడడం సరికాదని మండిపడ్డారు.

Jeevan Reddy takes on KCR

ప్రస్తుతం ఉన్న సచివాలయం నుంచే పాలనా వ్యవహారాలను చక్కదిద్దితే.. గత సీఎంల కుమారుల మాదిరి తన కుమారుడు కేటీఆర్ ఎక్కడ సీఎం అవకుండా పోతారోనని కేసీఆర్ భయపడుతున్నట్టుగా ఆరోపించారు. కేటీఆర్ కాకుండా హరీశ్ సీఎం అవవచ్చునేమోన్న భయంలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి కామెంట్స్.. టీఆర్ఎస్ లో కేటీఆర్ హరీశ్ రావుల నంబర్ గేమ్ పాలిటిక్స్ ను మరోసారి టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తోంది.

English summary
Telangana congress MLA Jeevan Reddy alleged CM KCR. He said that KCR was fearing of Harish rao, where he occupies cm seat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X