జీవన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ పిలుపు - కీలక హామీ..!!
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం ఢిల్లీకి చేరింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. జీవన్ రెడ్డితో మంత్రులతో పాటుగా పార్టీ ముఖ్యనేతలు మంత్రాంగం నడిపారు. కానీ, జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. తనకు పార్టీలో గౌరవం లేకుండా చేసారని..తాను ఎవరిపైన పోరాటం చేసానో వారినే పార్టీలో చేర్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, సోనియా నేరుగా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా సూచించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేకూర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏకంగా పార్టీ అగ్ర నాయకత్వం ఆయనకు ఫోన్ చేశారు. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఇపట్పికే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దళ్లి శ్రీధర్ బాబు లు జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈ రోజు ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.

వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలు దేరారు..జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పంపించే బాద్యతలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్‌ను కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ వైఖరిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీలో చర్చల తరువాత జీవన్ రెడ్డి తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications