రేవంత్ ప్రభుత్వంలో కొత్త నియామకాలు

Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక్కడున్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. అత్యధిక స్థానాలను గెలుచుకుంటామనే ధీమా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల్లో వ్యక్తమౌతోంది.

అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం నెలకొంది తెలంగాణలో. వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్.. తాము దక్కించుకోవడానికి మిగిలిన రెండు పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Joginder Tanikella is the new CEO to T-Works and Sita Pallacholla for We-HUB

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. కొత్త నియామకాలను చేపట్టారు. ప్రతిష్ఠాత్మకమైన టీ- వర్క్స్, వుయ్ హబ్‌లకు కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించారు. ఐటీ మంత్రిత్వ శాఖకూ ప్రత్యేకంగా అడ్వైజర్‌ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టీ- వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జోగిందర్ తనికెళ్ల నియమితులయ్యారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రభుత్వం చెల్లించే వేతనం 1.50 లక్షల రూపాయలు. వేరియబుల్ శాలరీ బట్టి సంవత్సరానికి 6 లక్షల రూపాయలను చెల్లిస్తుంది.

సీత పల్లచోళ్లను వుయ్-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపాయింట్ చేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మూడు సంత్సరాల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆమె ప్రభుత్వం చెల్లించే పారితోషికం నెలకు రెండు లక్షల రూపాయలు. పనితీరును బట్టి సంవత్సరానికి 6 లక్షల రూపాయల వరకు వేరియబుల్ శాలరీ అందుతుంది.

ఐటీ మంత్రిత్వ శాఖ సలహాదారుగా సాయికృష్ణ నియమితులయ్యారు. ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సలహాదారుగా వ్యవహరిస్తారాయన. ఈ మేరకు ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+