జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం: టఫ్ పైట్ లో గెలిచేది ఎవరు?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరా హోరీగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రధానపార్టీలు- కాంగ్రెస్, BJP, BRS పార్టీల అభ్యర్ధుల తరఫున ఆయా పార్టీల నాయకులు నియోయజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారం వేగవంతం చేసేలా ప్లాన్ చేసిన కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపధ్యంలో కాంగ్రెస్ యూసఫ్ గూడా డివిజన్ ముఖ్యనాయకుల సమావేశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు డివిజన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్ సహా పలువురు హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేసేలా కార్యాచరణ ను చర్చించినట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీతక్క
కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని, స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనీ చర్చించినట్లు, పోలింగ్ శాశం పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.కాగా ఈ ఉదయం మంత్రి సీతక్క నగరంలోని కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. స్థానిక వీధి వ్యాపారులతో ముచ్చటించారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ సమావేశం
ఇలా ఉండగా, BJP రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇంచార్జిల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు N రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు , వేముల అశోక్,. చంద్రశేఖర్ జి ఇంకా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ గెలుపు 2028 లో బిజెపి ప్రభుత్వానికి నాంది
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు జూబ్లీహిల్స్ గెలుపు 2028 లో బిజెపి ప్రభుత్వానికి నాంది అవుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బిజెపికి ఓటు వేయకపోతే , మజ్లిస్ కు 8 సీట్లు అవుతాయన్నారు.
ఎంఐఎం ను ఆపాలి అంటే బిజెపిని గెలిపించాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్లో ఎంఐఎం ను ఆపాలి అంటే బిజెపిని గెలిపించాలని, ఆ ఆలోచన ప్రజలకు కూడా వచ్చిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో బిజెపికి విజయ అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టు బి ఆర్ ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు
ఆటోలో ప్రయాణించి ఎన్నికల ప్రచారం చేసిన కేటీఆర్
మరోవైపు BRS కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఆ పార్టీ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణించి పార్టీ అభ్యర్ధి కోసం ఎన్నికల ప్రచారం చేశారు.
టఫ్ ఫైట్ లో ఎవరికి ప్రజలు పట్టం కడతారో
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అడుగడుగున వైఫల్యాల పాలన అని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీలు తమదైన పంధాలో త్వరలో దూకుడు చూపిస్తున్న క్రమంలో టఫ్ ఫైట్ లో ఎవరికి ప్రజలు పట్టం కడతారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications