అత్యాచారం కేసు నిందితులు దేశం దాటి వెళుతున్నారు??

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తనవద్ద మరికొన్ని ఆధారాలున్నాయని, వాటిని న్యాయస్థానానికి, పోలీసులకు అందజేస్తానన్నారు. అత్యాచారం కేసులో నిందితులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని రఘునందన్ రావు తెలిపారు. నిందితులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐతో కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

jubilee hills rape case accused are crossing the country.. bjp mla raghunandanrao comments

కొందరు నిందితులను దేశాన్ని దాటిస్తున్నారని, అత్యాచారం జరిగింది ఒక కారులో అయితే మరో కారులో ఉన్నవారిని అరెస్ట్ చేస్తున్నారని, ఎంఐఎం కుమారుడి పాత్ర లేదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. వారేమైనా న్యాయమూర్తులా తీర్పు చెప్పడానికని రఘునందన్ రావు నిలదీశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎరుపురంగు మెర్సిడెస్ బెంజ్ కారు నెంబరు వివరాలు పరిశీలిస్తే నిందితులెవరో సులువుగా అర్థమవుతుందన్నారు.

పబ్ లోకి మైనర్లు ఎలా వచ్చారనే విషయానని ఆ పబ్ మేనేజరే చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినవారిని భయపెట్టండి.. అంతేకానీ ఆధారాలిస్తున్న తమను భయపెట్టడం కాదని, తెలంగాణలో కేసులకు భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. మేం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు చూపించేవరకు మీ విచారణ ఏమైందని రఘునందన్ రావు ప్రశ్నించారు. దయచేసి ఆధారాలు చెరిపివేయవద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+