హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. ఇంటిస్థలం వివాదంలో మహిళపై కేసు.. రికవరీ ట్రిబ్యునల్ షాక్
మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది సామాన్యులయితే తెలీదు అనుకుందాం.. కానీ సినీ సెలబ్రిటీలను సైతం మోసం చేసేవాళ్లు బోలెడంత మంది ఉన్నారు అన్న విషయం అనేక సందర్భాలలో వెలుగులోకి వచ్చింది. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా జూబ్లీహిల్స్ లో ఒక స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు.
జూబ్లీహిల్స్ లో స్థలం కొనుక్కున్న ఎన్టీఆర్ .. వివాదం
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలానికి సంబంధించి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు.జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 గజాల స్థలాన్ని సుంకు గీతా అనే మహిళ నుంచి 2003లో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది.

బ్యాంకుల్లో తనఖా ఉన్న స్థలం.. ఎన్టీఆర్ కు నోటీసులు
ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మక ముందే సుంకు గీత 1996లో తమ వద్ద తనఖా పెట్టి లోన్ తీసుకున్నారంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. దీంతో ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ కు నోటీసులు వచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ కు షాకిచ్చిన రికవరీ ట్రిబ్యునల్
ఇక ఆ ప్రాపర్టీని బ్యాంకులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అయితే డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టు మెట్లు ఎక్కారు జూనియర్ ఎన్టీఆర్.

హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటీషన్
జూనియర్ ఎన్టీఆర్ తన జూబ్లీహిల్స్ లోని స్థల వివాదం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను 2003లో సుంకు గీత నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్టు, ఆమె 1996 లోనే తనఖా పెట్టి రుణం పొందా అంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయని ఆయన పేర్కొన్నారు.
సుంకు గీతపై కేసు నమోదు
దెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీత పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications