హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏ ముఖ్యమంత్రికి లేనంతగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫాలోవర్స్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) వ్యవస్థాపకులను ప్రోత్సహించేందుకు బూస్ట్ యువర్ బిజినెస్ పేరుతో ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌ పేరిట సోమవారం తొలి సదస్సుని హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఫేస్‌బుక్ పేజీల ద్వారా వినూత్న విజయం సాధించిన ముగ్గురు విజేతలను అభినందించి అనంతరం ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను ప్రచారం చేయడానికి, పారదర్శకతను పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని ఫోటోలు

అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2.75 లక్షల ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్‌ ఉన్నారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన 3.6 కోట్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపు 8 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, వీరందరూ టెక్నాలజీని వినియోగించుకోవటం ద్వారా తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

త్వరలోనే మంత్రులందరికీ ఫేస్‌బుక్ ఖాతాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకలాంటిదన్నారు. ఉపాధికల్పనలో అరవై శాతం ఈ రంగం నుంచే వస్తున్నదంటే ఎస్‌ఎంఈల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ మీడియాను వినియోగించుకోవటం ద్వారా ఎస్‌ఎంఇలు పెద్ద ఎత్తున అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతిలో భాగంగా ఒక్కో గ్రామపంచాయతీకి ఫేస్‌బుక్ పేజీ ఏర్పాటు చేసి, తద్వారా అభివృద్ధిని తెలియజేయడంతోపాటు విరాళం ఇచ్చేవారికి కూడా వారధిలాగా ఉంటామన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ఇ-పంచాయితీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ అంకీదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ వాతావరణాన్ని కల్పిస్తుందని, ఫేస్‌బుక్ సంస్థ హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామికపాలసీ చాలా బాగుందని కొనియాడారు.

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ ప్రొగ్రామ్‌‌లో కేసీఆర్

భారతీయ చిరు వ్యాపారాలకు (ఎస్‌ఎంఇ) దన్నుగా నిలిచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫేస్‌బుక్‌ ఇండియా ఎకనమిక్‌ గ్రోత్‌ హెడ్‌ రితేష్‌ మెహతా ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్‌ ఇండియా, స్కిల్స్‌ ఇండియా విజన్‌కు తోడ్పాటునందించేందుకు గాను తొలిసారిగా ఈ ఏడాది స్మాల్‌ బిజినెస్‌ బూస్ట్‌ సదస్సులను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు.

English summary
Minister for IT Mr K T Rama rao launching programme in Hyderabad, India – Facebook India is expanding its investments in small businesses in India with the first of many Small Business Boost events happening across the country this year. Helping to advance the government’s Digital India and Skills India vision, Facebook’s Small Business Boost program has been designed to arm Indian businesses with the knowledge, skills and technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X