Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో పిటీషన్

నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ సచివాలయ భవనంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఘటన.. రాజకీయరంగును పులముకుంది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంది.

హైదరాబాద్: తుదిదశ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటోన్న తెలంగాణ సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదం రాజకీయ వేడిని రగిల్చింది. ఈ ప్రమాదం- రాజకీయ రంగును పులుముకుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సచివాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా సచివాలయానికి బయలుదేరిన నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ నాయకుల అరెస్టును తప్పుపట్టారు.

నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయ భవనంలో మూడు రోజుల కిందట అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయిదు, ఆరు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సచివాలయం ప్రధాన గుమ్మటంపై దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర పకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని భద్రతా సిబ్బంది తెలిపారు.

 KA Paul files PIL in Telangana High Court on the fire doused in newly constructed Secretariat building

ఈ ఘటన పట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇది వరకు కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ లేవనెత్తారు. తాజాగా ప్రజా శాంతి పార్టీ కూడా అదే డిమాండ్ ను అందుకుంది. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేసింది. సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటన వెనుక నిజనిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

ఈ ఉదంతంపై సీబీఐ విచారణ జరిపించేలా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. తాను ఇదివరకు దాఖలు చేసిన పలు పిల్స్‌ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని పరిశీలనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి బెంచ్- పిల్‌కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు ఆదేశించారు.

దీనితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారని, అది సరికాదని కేఏ పాల్ పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనం కావడం వల్ల ఏప్రిల్‌ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు దీన్ని ప్రారంభించేలా ప్రభుత్వానికి ఆదేశించాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. వాస్తు బాగోలేదనే కారణంతో పాత సచివాలయాన్ని కూల్చి ప్రభుత్వం తప్పు చేసిందని కేఏ పాల్ విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+