ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..
ప్రస్తుతం ఉరుకులు పరుగుల లైఫ్ లో నగరవాసులు కాస్త సేద తీరేందుకు వీలుగా వీకెండ్ టూర్స్ కు వెళ్తుంటారు. కొంతమంది నగరంలోని ప్రదేశాలను చూసేందుకు సమయం కేటాయిస్తే.. మరికొందరు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మనందరికీ తెలిసిందే. దాన్ని మించిన అరుదైన పక్షులు, జంతువులు, సరీసృపాలు, కీటకాలు మనకు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్ లోని ఎకోలాజికల్ పార్క్ లో ఉన్నాయి. అదే 'కచ్చే రాస్తే' ఎకోలాజికల్ పార్క్.. ఈ పార్కులో ఎన్నో రకాల అరుదైన జంతువులు, పక్షులు, పాములకు నిలయంగా మారింది. నిత్యం ఈ పార్కును వందలాది మంది సందర్శిస్తుంటారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తుంటారు.
హైదరాబాద్ లోని అన్నారం సమీపంలోని కేసీఆర్ కాలనీ లో ఈ 'కచ్చే రాస్తే' ఎకోలాజికల్ పార్క్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీకు ఎదురుగానే ఈ పార్కు ఉంటుంది. ఇక్కడి పార్కులో సందర్శకులు ఎంచక్కా జంతువులు, కీటకాలు, పక్షులు, పాములతో సరదాగా గడిపేయొచ్చు. బిజీ లైఫ్ ను పక్కన పెట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో హాయిగా విహరించవచ్చు. ఇక పిల్లలకు అయితే బెస్ట్ ఎవేర్ నెస్ పార్క్ గా ఇది నిలుస్తోంది. ఈ పార్కును సందర్శిస్తే వాళ్లు ప్రకృతిని అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది.
'కచ్చే రాస్తే' ఎకోలాజికల్ పార్క్ హైదరాబాద్ కు కేవలం 40 కి. మీ. దూరంలోనే ఉంటుంది. 45 నుంచి 60 నిమిషాల్లోపు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ ఎకోలాజికల్ పార్క్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 వరకు ఈ పార్కులోకి ఎంట్రీ ఉంటుంది. అయితే ప్రతి బుధవారం ఈ పార్కును మూసి వేస్తారు. పర్యటకులు, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఇక ఎంట్రీ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 600 ఉంటుంది. అలాగే 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. వీరితోపాటు దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఇక ఇక్కడ దాదాపు 200 లకు పైగా రకాల పక్షులు ఉన్నాయి. అలాగే వింత వింత జంతువులకు నిలయంగా ఈ హైదరాబాద్ ఎకోలాజికల్ పార్క్ ఉంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications