కేసీఆర్ కోసం సచివాలయం వెళ్లిన కడప మహిళలు : విషయమేంటి?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : ఆపదల్లో ఉన్నవారు ఆయన్ను కలిస్తే తక్షణ సహాయం అందుతున్న నమ్మకం ప్రజల్లో ఏర్పడినట్లుంది. అందుకే కాబోలు.. ఆయన తెలంగాణకు సీఎం అయినా.. ఏపీ ప్రజలు సైతం సహాయం కోసం ఆయన్ను అభ్యర్థిస్తున్నారు.

తాజాగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ముంతాజ్, షాహీన్ సహాయం కోసం సీఎం కేసీఆర్ కు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో.. నిరాశతోనే వెనుతిరిగినట్లుగా తెలుస్తోంది.

Kadapa Woman request to CM KCR for financial help

ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ముంతాజ్ కుటుంబం.. భర్త అనారోగ్యానికి గురికావడంతో మరింత కష్టాల్లో పడిందని ఆమె వాపోయినట్లు సమాచారం. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా భర్తకు చికిత్స అందించినా.. కాళ్లు విరిగి నడవలేని స్థితిలో ఉండడంతో కుటుంబం గడవడం కష్టంగా మారినట్లు ముంతాజ్, షాహీన్ తమ గోడు వెల్లబోసుకున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో సీఎంఆర్ఎఫ్ విభాగంలో వినతి పత్రాలు అందించాలని భద్రతా అధికారులు సదరు మహిళలకు సూచించారు. అయితే గంటపాటు సచివాలయం వద్దే సీఎం కేసీఆర్ కోసం వేచి చూసిన ముంతాజ్, షాహీన్ ఆ తర్వాత వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On wednesday two woman from kadapa are tried to meet telangana cm kcr in secretariate. they want to request cm kcr for financial help to their family

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి