ఎన్నికలవేళ కేసీఆర్‌కు కాళేశ్వరం టెన్షన్.. మొన్న మేడిగడ్డ.. నేడు అన్నారం సరస్వతీ బ్యారేజ్ లీకేజీ!!
ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న మేడి గడ్డలో లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ఘటన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణలో సాగునీటి వసతి కల్పించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాంకేతిక లోపాలతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
మొన్నటికి మొన్న లక్ష్మీ బ్యారేజీలో 19 వ పిల్లర్ నుండి 21 వరకు పిల్లర్లు కుంగి పోగా, ప్రస్తుతం సరస్వతి బ్యారేజ్ లో కూడా సాంకేతిక లోపం బయటపడింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ గతంలో వరదలకు పంప్ హౌస్ నీట మునిగి వార్తల్లో నిలిచినా విషయం తెలిసిందే.

ఇప్పుడు అన్నారం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సరస్వతి బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టుకు బుంగ పడినట్టు తెలుస్తోంది. వరద నీరు విడుదల జరిగే ప్రదేశంలో అడుగు నుండి నీరు పైకి ఉబికి వస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ఏర్పడినటువంటి బుంగతో ప్రమాదం ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నారం సరస్వతి బ్యారేజీ కి లీకేజీలు#AnnaramSarasatiBarraige #KaleshwaramProject #Oneindiatelugu pic.twitter.com/2txOHjOXfk
— oneindiatelugu (@oneindiatelugu) November 1, 2023
దీంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి నీటి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ప్రమాదకరం కాదని నూతన సాంకేతికతతో ఇసుక పైన నిర్మించిన కట్టడం మూలంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని దీనిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు.
దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం 5.71 టిఎంసీలు ఉన్న వాటర్, ఒక గేటు ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేగడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దీంతో పెద్ద తలనొప్పి తయారయింది. ఇది మరోమారు ప్రతిక్షాలకు ఆయుధంగా మారింది.












Click it and Unblock the Notifications