తప్పకుండా సాయం చేస్తా: ట్వీట్ చేసిన వెంటనే స్పందించిన ఎంపీ కవిత
నిజామాబాద్ పార్లమెంటుసభ్యులురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రెండు కాళ్లు కోల్పోయిన ఓ యువకుడు ట్విట్టర్‌లో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. దీంతో వెంటనే స్పందించిన కవిత..
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటుసభ్యులురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రెండు కాళ్లు కోల్పోయిన ఓ యువకుడు ట్విట్టర్‌లో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. దీంతో వెంటనే స్పందించిన కవిత.. మీ వివరాలు పంపండి, తప్పకుండా సాయం చేస్తామంటూ భరోసానిచ్చారు.
@RaoKavitha madam 10.1.14 roju bathukamma flwrs ki velli curent shock valla 2legs poyayi CM fond apply chesam raledu madam plz ippinchandi pic.twitter.com/hfvYh9W3qs
— s shekhar (@shekhar436) April 4, 2017
వివరాల్లోకి వెళితే.. బతుకమ్మ పూలు కోసి తెచ్చేందుకు వెళ్లిన సమయంలో తనకు కరెంటు షాక్ తగిలిందని, దీంతో తన రెండు కాళ్లు కోల్పోయానని మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ ఎస్ శేఖర్ ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు తెలిపారు. తనకు సాయం చేయాలని ఆమెను కోరారు.

2014, జనవరి 10న తాను తన కాళ్లు కోల్పోయి.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసినా ఎలాంటి సాయం అందలేదని శేఖర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. శేఖర్ ట్వీట్‌పై ఎంపీ కవిత వెంటనే స్పందించి.. మీకు తప్పకుండా సాయం చేస్తానని రీట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు. శేఖర్ పూర్తి వివరాలను [email protected]కు పంపించాలని ఆమె తన ట్టీట్‌లో సూచించారు.
Tappakunda .. pls send me your details on [email protected] https://t.co/Oz9RzIeeP4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 4, 2017
కాగా, కాళ్లు కోల్పోయినప్పుడు చికిత్స కోసం రూ. 18లక్షల వరకు ఖర్చు పెట్టామని, ఆర్థికంగా తనను ఆదుకోవాలని పలుమార్లు అధికార పార్టీ నేతలకు పలుమార్లు విన్నవించుకున్నాడు. బీటెక్ పూర్తి చేసిన తనకు వికలాంగుల కోటాల తగిన ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. గత కొంత కాలంగా సాయం వేచిచూస్తున్న శేఖర్‌కు ఎట్టకేలకు కవిత హామీతో సాయం అందేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications