వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా కుటుంబంపై పడ్డారేం! లోకేష్ మాటేమిటి: కవిత ఆగ్రహం, ఆంధ్రా నాణేలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: దేశంలో ఎక్కడా వారసత్వ రాజకీయాలు లేవా, తమ కుటుంబంలోనే ఉన్నాయా? అని నిజామాబాద్ ఎంపీ, టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన అన్న విపక్షాల వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు.

అందరు తమ కుటుంబాన్నే ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబం ఎప్పుడు కూడా నేరుగా పదవులు తీసుకోలేదని చెప్పారు. ఉద్యమాలు చేసి, ప్రజల దీవెనతో గెలిచామన్నారు. అవే తమకు వచ్చిన పదవులు అన్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు ఏ పదవి ఉందని అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్నారని నిలదీశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను రాష్ట్ర రాజకీయాల పైన దృష్టి సారిస్తున్నానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, జానా రెడ్డిల విమర్శలు అర్థరహితమని మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థుల చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ తెచ్చేవారా అని ప్రశ్నించారు.

ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్ర ఏమిటనేది కాంగ్రెస్ పార్టీ కంటే ప్రజలకే బాగా తెలుసునని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దయాగర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

కాగా, బుధవారం నాడు కవిత పర్వతగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి, కాంగ్రెస్, టిడిపిలపై మండిపడ్డారు. మరోవైపు, కవిత ప్రచారాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో పోలీసులు ఆశా కార్యకర్తలను, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

ఆంధ్రా నాణేనికి బీజేపీ, టీడీపీ బొమ్మాబొరుసులా వ్యవహరిస్తుంటాయని నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండల కేంద్రంలోని బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్‌లో 11మంది ఎంపీలం ఉన్నామని, తెలంగాణ సమస్యలపై 15నెలలుగా అనునిత్యం ఉద్యమిస్తున్నామన్నారు.

పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి పలు మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ఆంధ్రకు మాత్రం రూ.8వేలకోట్ల నిధులను కేటాయించించడమే కాకుండా పది పెద్ద విద్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్పారు.

పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

తెలంగాణలో రెండు సంవత్సరాలుగా పంటలు నష్టపోయిన విషయంపై పరిహారం ఇవ్వాలని కోరితే తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదని కల్లబొల్లి సాకులతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా నేటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారీ సహకారం అందించలేదన్నారు.

పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

11మందితో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను ఎంపీగా గెలిపించి మరో సైనికుడిని పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఇద్దరున్నకాంగ్రెస్, ఒక్కరున్న టీడీపీ, బీజేపీ, వైసీపీలు రాష్ట్ర సమస్యలపై ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు.

పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన పథకాలను ఏ ప్రభుత్వం, నాయకులూ చేపట్టలేదని, మన రాష్ట్రం, మన నిధులు అన్నట్లుగా రాష్ట్రంలోని 119నియోజకవర్గాల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.760కోట్ల నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

 పర్వతగిరిలో కవిత ప్రచారం

పర్వతగిరిలో కవిత ప్రచారం

రుణమాఫీ దశల వారీగా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి రుణాలు మాఫీ చేస్తుంటే పక్క రాష్ట్రంలో నేటికీ ఆ ఊసేలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... మాట్లాడుతూ గత పాలకుల పాలనలో రైతన్నలు విత్తనాలు, కరెంటు, ఎరువుల కోసం రోడ్లెక్కి ఇబ్బందులు పడిన రోజులు ఉండేవని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు ఆ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.

English summary
MP Kavitha counter with Nara Lokesh and Rahul Gandhi on family politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X