హరీష్ పై అందుకే కోపం, కాంగ్రెస్ లో చేరికపై కవిత కొత్త ట్విస్ట్..!!
కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారనే వార్తల వేళ కవిత తన రాజకీయ భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చారు. అసలు హరీష్ ను టార్గెట్ చేయటం వెనుక కారణాలను వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది తనతో టచ్ లో ఉన్నారంటూ ఆసక్తి పెంచారు. బీఆర్ఎస్ ఏర్పాటు వేళ కేసీఆర్ చాలా మందితో చర్చలు చేసారని.. ఇప్పుడు తాను అదే చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో చేరిక పై కవిత ఆసక్తి కర అంశాలు వెల్లడించారు.
కవిత మరోసారి హరీష్ ను టార్గెట్ చేసారు. హరీష్ రావు టార్గెట్‌గా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశానని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు.. పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారని కవిత తెలిపారు. హరీష్ రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప మరే విషయంలోనూ తనకు కోపం లేదని క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ స్థాపన వంటి అంశాలపైనా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా? లేదా? అనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేసిన కవిత.. ప్రస్తుతం తాను కూడా అదే చేస్తున్నానని అన్నారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తానేనని కవిత వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ లో చేరిక పైన కవతి స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు అస్సలు లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ అప్రోచ్ కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తన పేరును ఎందుకు తీసుకొంటు న్నారో తెలియదన్నారు. ముఖ్యమంత్రి రేవంతే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమో అని వ్యాఖ్యానించారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పని చేయాలనుకుంటున్నట్లు కవిత తెలిపారు. బీసీ ఇష్యూ తన మనస్సుకు దగ్గరగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని.. తన ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. చాలామంది తనను వచ్చి కలుస్తున్నట్లు కవిత తెలిపారు. తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదే ఉందని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. దీంతో.. కవిత కొత్త పార్టీ దిశగానే అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications