బీఆర్ఎస్ కు కవిత షాక్.. 2029ఎన్నికల్లో అదే చేస్తానని ప్రకటన!
తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కూడా కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు. తనను ఆపరేట్ చేసే అంత సీన్ ఎవరికీ లేదన్నారు. 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
బీఆర్ఎస్ లోకి వెళ్ళేది లేదని తేల్చేసిన కవిత
యాదాద్రి భువనగిరిలోని వివేరా హోటల్లో 'జనం బాట' కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రావాలని పిలిచినా వెళ్ళేది లేదన్నారు. కారణం చెప్పకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పు ఏమిటో చెప్పకుండా తనను సస్పెండ్ చేసి బయటకు గెంటేశారు అన్నారు.

పెద్దల భూములను కాపాడటం కోసం పేదల భూములు లాక్కున్నారన్న కవిత
ఇప్పటివరకు 16 జిల్లాలను పర్యటించి ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటిపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నానని కవిత తెలిపారు. ఉమ్మడి యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని ఆమె విమర్శించారు. పెద్దల భూములు కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ కోసం పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని కవిత మండిపడ్డారు.
రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతుల కోసం పోరాటం చేస్తానని స్పష్టం
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలపై రైతుల పక్షాన తాను పోరాటం చేస్తానని అన్నారు. రాయిగిరి, తిమ్మాపురం, బస్వాపూర్ వంటి ప్రాంతాల రైతులతో కలిసి మాట్లాడిన కవిత, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో చిన్న రిజర్వాయర్‌ను పెద్దదిగా మార్చి రైతుల భూములు లాగేసుకున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామన్న కవిత
కొన్నిచోట్ల మూడుసార్లు మారిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌లను అంగీకరించబోమని ఆమె కరాఖండిగా చెప్పారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ఇద్దరు మంత్రుల పనితీరును కవిత ప్రశ్నించారు. ఇంకా అనేక సమస్యలపైన స్పందించిన కవిత పేద విద్యార్థులకు వెంటనే బోధనా రుసుములు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications