ఈడీ ముందుకు కవిత: ఢిల్లీ చేరుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులోనూ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణను ఎదుర్కోనున్నారు కవిత.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. లీగల్ టీంతో చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేటీఆర్.. అక్కడి కేసీఆర్ నివాసంలో కవితను కలిశారు. వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాగా, శని, ఆదివారాల్లో కేటీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.

మరోవైపు, కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని అన్నారు. కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు కేసీఆర్.
Delhi | Telangana Minister KT Rama Rao arrives at the residence of Telangana CM and his father K Chandrashekar Rao.
— ANI (@ANI) March 10, 2023
KTR's sister and BRS MLC K Kavitha is scheduled to appear before ED tomorrow, March 11 in connection with the Delhi liquor policy case. pic.twitter.com/stepzR4stJ
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు కవిత వరకు వచ్చారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగానే ఎదుర్కొందామని తెలిపారు. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications