బాబుతో విభేదించి.. ఆయన పిలుపుతో: 14ఏళ్ల తర్వాత ఆంధ్రాకు కెసిఆర్, మొక్కులు

హైదరాబాద్: 'తెలంగాణ' ఉద్యమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఆంధ్రా ప్రాంతంలో అడుగు పెడుతున్నారు. టిడిపిలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కెసిఆర్... 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయన ఏపీలో పెద్దగా అడుగు పెట్టలేదు.

తెలంగాణలో కాలికి బలపం కట్టుకొని తిరిగిన కెసిఆర్... పద్నాలుగేళ్ల తర్వాత ఆంధ్రాలో ఎల్లుండి (గురువారం) అడుగిడుదున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో ఉంది. అయితే, ఆంధ్రాలో మాత్రం అడుగు పెట్టలేదు.

ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఆంధ్రాకు రాలేదు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో... ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని అమరావతిలో అడుగుపెడుతున్నారు.

KCR to Andhra after 14 years

2010లో జై ఆంధ్ర, ఏపీ దళిత మహాసభ సభ్యులు విజయవాడలో ఓ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అయితే, లైలా తుపాను కారణంగా అది వాయిదా పడింది. ప్రత్యేక తెలంగాణ వస్తే విజయవాడ దుర్గమ్మకు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక ఆభరణాలు చేయిస్తానని ఆయన మొక్కుకున్నారు.

ఇప్పుడు కెసిఆర్ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో, ఆయన తిరుమల శ్రీవారికి, బెజవాడ దుర్మమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే అవకాశాలు కొట్టిపారేయలేం.

అయితే, అది అమరావతి శంకుస్థాపన కార్యక్రమం... అనంతరం తర్వాత జరగవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణ కోసం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపిని ఆ రోజు వదిలిన కెసిఆర్... ఇప్పుడు అదే చంద్రబాబు పిలుపు మేరకు అమరావతికి వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+