వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూచించా, రూ.2వేలు రద్దవొచ్చు, మోడీ శిక్షకు సిద్ధమన్నారు: కేసీఆర్, గాలి కూతురు పెళ్లిపై

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు భారత్ క్యాష్ లెస్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీతో తాను ఏం మాట్లాడానో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు భారత్ క్యాష్ లెస్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీతో తాను ఏం మాట్లాడానో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మోడీకి కొన్ని సూచనలు చేశా

నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రాన్ని తాము కోరామని చెప్పారు. ప్రధానితో భేటీలో తన అనుభవాలు, అవగాహనను ఆయనతో పంచుకున్నానని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మోడీకి కొన్ని సూచనలు చేశానని చెప్పారు.

తన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలుతన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తాను కూడా నోట్ల రద్దు తదితరాలపై కొన్ని సూచనలు చేశానని చెప్పారు. ప్రజల కష్టాలు, నోట్ల రద్దను విజయవంతం చేసే అంశాల పైన ఆయనతో చర్చించానని చెప్పారు. సమూల మార్పు దిశగా ముందుకెళ్తున్నట్లు ప్రధాని తనతో చెప్పారన్నారు.

kcr

నల్లధనం ఏ రూపంలోనైనా ఉండవచ్చునని చెప్పారు. డబ్బు రూపంలో, వజ్రాల రూపంలో, బంగారం, బంగ్లా రూపంలో ఇలా ఎలాగైనా ఉండవచ్చునని చెప్పారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా పూర్తిగా రూపుమాపాలని చెప్పారు. సంపూర్ణ క్రాంతి తీసుకు రావాలని తాను ప్రధాని మోడీని కోరానని చెప్పారు.

రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది

భారత్ ఎక్కువగా నగదు లావాదేవీల పైనే ఆధారపడి ఉందని కేసీఆర్ చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా రియల్ ఎస్టేట్ పైన పడుతుందన్నారు. రియల్ ఎస్టేట్ స్తంబించే అవకాశముందన్నారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం పడిపోతుందన్నారు. కేంద్రం కూడా తమను ఆదుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మర్చండ్ డిస్కౌంట్ రేటును తీసేయాలి లేదా తగ్గించాలని ప్రధానిని కోరానని చెప్పారు.

జగన్ కంటే టిడిపినే కోరుకుంటున్న కేసీఆర్జగన్ కంటే టిడిపినే కోరుకుంటున్న కేసీఆర్

క్యాష్ లెస్‌ను అందరు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వాలు కూడా బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగేందుకు ప్రోత్సహించాలన్నారు. ఈ విషయంలో కేంద్రం చేసుకుంటూ పోతోందని, రాష్ట్రం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. క్యాష్ లెస్ విధానాన్ని అందరూ ప్రోత్సహించాలన్నారు.

క్యాష్ లెస్ కంట్రీ కావాలంటే..

అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలన్నారు. చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవన్నారు. వారందరికీ అకౌంట్లు ఇప్పించాలన్నారు. దేశం క్యాష్ లెస్ కంట్రీ కావాలంటే ఒకటి స్వైపింగ్ మిషన్ కావాలని, రెండోది మొబైల్ యాప్ అన్నారు. బ్యాంకు లావాదేవీల ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. అన్ని మార్కెట్ యార్డుల్లోను బ్యాంకుల ద్వారా డబ్బులు ఇచ్చేలా ఉండాలన్నారు.

ఓ సందర్భంలో కేసీఆర్ ఇప్పటికిప్పుడు క్యాష్ లెస్ ఇబ్బంది గురించి మాట్లాడుతూ.. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ప్రస్తావనను తీసుకు వచ్చారు. అరటి పళ్లు, కూరగాయలు కొంటే చెక్‌ ఇచ్చి కొనే దేశం మనది కాదని, మనదేశంలో చెక్కులిచ్చి చేపలు కొనేవాళ్లను చూపిస్తారా అని ప్రధానిని అడిగానని, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్లు కూడా పసుపు కుంకుమ, పూవులు చెక్కులు కొనరని చెప్పానని, అలాంటప్పుడు నగదును కట్టడి చేస్తే సమస్యలొస్తాయని, అందుకే ఈ ఇబ్బందులన్నీ చూస్తున్నామన్నారు.

దేశంలో 14.4 లక్షల స్వైపింగ్ మిషన్లు వాడుతున్నారని చెప్పారు. దేశాన్ని క్యాష్ లెస్ కంట్రీగా చేయాలంటే 10 కోట్ల స్వైపింగ్ మిషన్లు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో 25 వేల నుంచి 70వేల స్వైపింగ్ మిషన్లు ఉన్నాయన్నారు.

ఇంకేదో మాట్లాడానని అనుకోవచ్చు కానీ

ప్రధాని మోడీతో నేను రెండుమూడుసార్లు మాట్లాడానని, నిన్న విమానాశ్రయంలోను మాట్లాడానని చెప్పారు. తాను క్యాష్ లెస్, నోట్ల రద్దు ఇబ్బందులు తదితర అంశాల పైనే మాట్లాడానని చెప్పారు. మరేదో మాట్లాడానని అనుకోవద్దన్నారు.

వంద శాతం నల్లధనం లేకుండా చేయండి

తాను ప్రధాని నరేంద్ర మోడీని ఓ కోరిక కోరుతున్నానని, దయచేసి వందశాతం నల్లధనం లేని దేశంగా, లంచాలు లేని దేశంగా తయారు చేయలాలని చెప్పారు. ఇదే విషయం ప్రధాని మోడీని కోరానని, ఆయన అంగీకరించారని, అప్పుడు తెలంగాణ మద్దతిస్తుందని చెప్పానని అన్నారు. నల్ల డబ్బు, నల్ల జబ్బు ఉండవద్దన్నారు. సంపూర్ణ క్రాంతి వైపు అడుగేస్తే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్రానికి అండగా నిలబడతారని చెప్పారు.

రూ.2వేలు కూడా రద్దు కావొచ్చు

కేంద్రానిది ప్రణాళికా బద్ధమైన చర్య అని, ఇదొక వ్యూహమన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకునేవారు అలా చేసుకోవచ్చునని చెప్పారు. ప్రధానిలాంటి వ్యక్తికి ఊరికే దేశాన్ని గోల్‌మాల్‌ చేసే అవసరం లేదన్నారు. ఇప్పుడు వచ్చిన రూ.2వేల నోట్లు కూడా భవిష్యత్తులో రద్దయ్యే అవకాశం లేకపోలేదన్నారు. నల్లకుబేరులను పట్టుకోవడానికి వ్యూహాలుంటాయి. అవి ఇప్పుడు అర్థం కాకపోవచ్చునని వ్యాఖ్యానించారు.

కానీ ఆ వ్యూహాలు వారికి తెలుసునన్నారు. నేనూ ప్రధానికి చెప్పిన కొన్ని విషయాలు మీకు చెప్పలేనని, ప్రజలకు ఎంత చెప్పాలో అంతే చెబుతామన్నారు. తొలిసారి దేశంలో ఓ పెద్ద సంస్కరణ వచ్చిందన్నారు. దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. పెద్దపెద్ద నేతలనే బండకేసి కొట్టారని, ఇందిరా గాంధీని ఓడించారని, నేను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని మోడీ చెబుతున్నారన్నారు.

English summary
Telangana Chief Minister KCR bats for Cash less country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X