వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27కు కేసీఆర్ ఆమోదం: తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు ఇవే!

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల కసరత్తుని కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు 27 జిల్లాలను ప్రతిపాదిస్తూ నివేదిక రూపొందించింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆ నివేదికను బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల ఏర్పాటుపై మూడురోజులపాటు నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశాలలో వచ్చిన ప్రతిపాదనలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఉపసంఘం పరిగణనలోకి తీసుకుందని అలీ వివరించారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు.

kcr confirmed 27 districts in telangana state

ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు.సబ్ కమిటీ నివేదిక రూపొందించిన ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై ఈ నెల 20న జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. ఆ అభిప్రాయాలను కూడా తీసుకొని అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

ఆ తరువాత 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నాటినుంచి నెల రోజుల వరకు ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసి దసరానాటికి గెజిట్ నోటిఫికేషన విడుదల చేస్తారు. దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన కొనసాగనుంది.

కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఇవే:

1. ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల
2. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల
3. వరంగల్ జిల్లాలో హన్మకొండ, మహబూబాబాదు, భూపాలపల్లి
4. మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట
5. నిజామాబాదు జిల్లాలో కామారెడ్డి
6. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం
7. నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి
8. మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, వనపర్తి
9. మిగిలిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలను మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

English summary
Telangana Cheif minsiter KCR confirmed 27 districts in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X