కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణలను కేసీఆర్ ద్వంసం చేశారు.!రైతు వైభవాన్ని పునఃప్రతిష్టిస్తామన్న రేవంత్.!
హైదరాబాద్ : భూమి కోసం విప్లవం వచ్చిన ఏకైక ప్రాంతం తెలంగాణ అని, తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రపంచం మరిచిపోలేదని ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల ఆరో తారీఖున వరంగల్ బహిరంగసభలో చేసిన రైతు డిక్లరేషన్ కార్యక్రమాన్ని రైతులకు పూర్తి స్థాయిలో అందే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీలో రైతు సంక్షేమం కోసం 81ప్రాజెక్టులు నిర్మించాం.. మీట్ ద ప్రెస్ లో స్పష్టం చేసిన రేవంత్
మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వ్యవసాయం, భూములు, కౌలు భూములు అనే అంశాలపై సుధీర్ఘంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి పాత్రికేయులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 81 ప్రాజెక్టులను నిర్మాణం తలపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేసారు. మనిషి లక్షణం తెలుసుకోవాలంటే డీఎన్ఏ పరీక్ష ఎలాగో భూమి లక్షణం తెలుసుకోవాలంటే కూడా డీఎన్ఏ పరీక్షలు అవసరమన్నారు రేవంత్ రెడ్డి. రైతుకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అనేక పాలసీలు తెచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు.

60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 69వేల కోట్లు అప్పు..కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఐదు లక్షల కోట్లు అప్పు
అంతే కాకుండా రైతులను దోపిడీ చేస్తున్న విధానాలకు అడ్డుకట్ట వేసే చట్టాలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రేవంత్ తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దివాల తీయించారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడున్న అభివృద్ధి అంతా ఆనాడు చేసి చూపించామన్నారు రేవంత్ రెడ్డి. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 69వేల కోట్లు అప్పు చేస్తే, చంద్రశేఖర్ రావు ఏడేళ్ల పాలనలో ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని వివరించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మిగులు బడ్జెట్ తో తెలంగాణ అప్పగిస్తే చంద్రశేఖర్ రావు అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.

తెలంగాణలో శ్రీలంక పరిస్థితులు.. కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్న రేవంత్
ఇదిలా ఉండగా శ్రీలంక పరిస్థితి తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు తెస్తున్నారని, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కుటుంబం పై జరిగిన దాడే చంద్రశేఖర్ రావు కుటుంబానికి రాబోతోందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను చంద్రశేఖర్ రావు విద్వంసం చేశారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో చెరుకు, కందులు, పత్తిపంటలు మాయమయ్యాయని, ఇప్పుడు వరికి మాత్రమే రైతులు పరిమితం అవుతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు నీళ్లు ఇస్తే, 30 లక్షల పంపుసెట్లు ఎందుకు ఇంకా ఉన్నాయని నిలదీసారు. 12నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ వందశాతం అమలు చేస్తామనన్నారు రేవంత్ రెడ్డి.

రైతు డిక్లరేషన్ అమలు చేసే భాద్యత నాదే.. రైతులకు రేవంత్ భరోసా
రైతు డిక్లరేషన్ అమలు చేసే టీపీసీసీ అధ్యక్షుడుగా భాద్యత తాను తీసుకుంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుబంధు ధనికులకు అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రావు తరహాలో వృధా ఖర్చులు చేయదన్నారు రేవంత్ రెడ్డి. ధరణిలో సవరణలు ఉంటాయని, పోడు భూములను గిరిజనులకు పంచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని, దోపిడీ మానేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని, మొదటి ప్రాధాన్యతగా రైతు డిక్లరేషన్ తీసుకున్నామని, రానున్న రోజుల్లో వైద్యం- విద్యా- నిరుద్యోగతపై డిక్లరేషన్స్ కూడా ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications