ఇమ్రాన్ ఖాక్‌కు ఉన్న బుద్ధి.. కేసీఆర్‌కు లేదు..! "అవినీతి ఫైల్స్" బయటకు తీస్తాం ..!! : బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. నిత్యం రాజకీయాలతో కాలం గడుపుతున్న.. కేసీఆర్ ఒక పెద్ద మోసకారి అంటూ నిప్పులు చెరిగారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా.. బీజేపీని ఏం చేయ్యలేరని హెచ్చరించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన రజాకార్ల పాలన తలపిస్తోంని దుయ్యబట్టారు. భోదన్‌లో హిందువులు, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ముందస్తుకు జంకుతున్న కేసీఆర్..
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూసి సీఎం కేసీఆర్ జడుచుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్, పీకేల డ్రామాలు తెలంగాణ ప్రజల ముందు పనిచేయవని సైటైర్లు విసిరారు. టీఆర్ఎస్ పార్టీకి వచ్చేది 105 సీట్లు కాదు.. 10 సీట్లే అని చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. బీజేపీ 95 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న బుద్ధి కేసీఆర్‌కు లేదు..
అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి బండి సంజయ్ విమర్శించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న బుద్ధి కూడా .. సీఎం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తెచ్చిన ఘనత కేంద్రానిదని చెప్పారు. వయోభారంతో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని చురకలు అంటించారు.

" అవినీతి ఫైల్స్" బయటకు తెస్తాం
త్వరలోనే "పాతబస్తీ ఫైల్స్" , " అవినీతి ఫైల్స్" బయటకు తెస్తామని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. "కాశ్మీర్ ఫైల్స్" కు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం కేసీఆర్‌కి డీఎన్ఏ టెస్ట్ చెయ్యాలన్నారు. చైనా , పాకిస్థాన్‌లకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రోజుకో కొత్త డ్రామాను కేసీఆర్ తెరపైకి తెస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఖరీఫ్ సీజన్‌లో ఇవ్వాల్సిన పంట ఇంకా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. బియ్యం కుంభకోణంలో టీఆర్ఎస్ నేతల బండారం బయట పడుతోందన్నారు. బాయిల్డ్ రైస్ఇవ్వమని చెప్పి.. కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి.. రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications