కేసీఆర్ ఎన్ని'కల' నయా ప్లాన్.. ప్లీనరీకి ముందే నియోజకవర్గాల్లో సంబరాలు!!
ఎన్నికలను టార్గెట్ చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి, పార్టీ కేడర్ ను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ నయా ప్లాన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈసారి ఎన్నికల సాధన సంబరాలుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఒక బృహత్ ప్రణాళికను రూపొందించి ఏప్రిల్ 25 వ తేదీన సంబరాలను నిర్వహించాలని పేర్కొంది.
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ప్లీనరీకి ముందే రాష్ట్రవ్యాప్తంగా ఈ సంబరాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్ లు నియోజకవర్గాలలో అత్యంత ఘనంగా ప్లీనరీలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగనున్న ఈ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలలో క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున,ముందస్తుగా కేడర్ ను సిద్ధంచేసే క్రమంలోనే నియోజకవర్గాలలో సభలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

పండుగ వాతావరణంలో, ప్రజలందరినీ మమేకం చేస్తూ, పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు, కేడర్ అందరూ పాల్గొనేలా ఈ సమావేశాలను ఒక సంబరం జరిపినట్టు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా నియోజకవర్గ సంబరాల పేరుతో పండుగ వాతావరణం ఉండేలా నియోజకవర్గాలలో ఒక రోజు వేడుకలు జరపనున్నారు.
తోరణాలు, ఫ్లెక్సీలు కట్టి, గ్రామగ్రామాన పార్టీ గద్దెలకు రంగులు పూసి, జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు జరుపనున్నారు. నియోజకవర్గాల వ్యాప్తంగా జరగనున్న సమావేశాల సందర్భంగా పార్టీ గొప్పతనాన్ని ప్రభుత్వ పథకాలను, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు.

ప్రతి నియోజకవర్గంలోనూ మూడు వేల మందికి తగ్గకుండా, పార్టీ బలగమంతా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రజాక్షేత్రంలోకి పార్టీని బలంగా తీసుకువెళ్ళడమే కాకుండా, మంచి మైలేజ్ ను కూడా తీసుకు వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications