ఐదు నెలల్లోనే ఆగమాగం: కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ నిప్పులు
మెదక్: కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి, ప్రజలను మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సు యాత్రలో భాగంగా బుధవారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని కేసీఆర్ మండిపడ్డారు. రైతులను, యువకులను.. అందర్నీ కాంగ్రెస్ పార్టీ వంచించిందన్నారు.కాంగ్రెస్ పాలన వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు అందరికీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

తల, తోక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. కరెంటు కోతల కారణంగా హైదరాబాద్‌లో పరిశ్రమలు వెళ్లిపోయే, ఐటీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదని విమర్శించారు.
మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్‌కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు కేసీఆర్. మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇంకా నెరవేరుస్తదనే ఆశ లేదని అన్నారు. నర్సాపూర్‌ను కేసీఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసని అన్నారు.

నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇచ్చిన.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చినం.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారన్నారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీని పెడదామని అనుకున్నామని, దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేలా లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హల్దీవాగు మీద, మంజీరా నది మీద 10 చెక్‌డ్యామ్‌లు కట్టామని, దాని ద్వారా పంటలు పండించుకున్నామని కేసీఆర్ వివరించారు. అయితే, దాన్నంతా దెబ్బ తీసే పరిస్థితులు వస్తున్నాయని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు నీరు రాదు.. తాగునీరు రావు.. కరెంటు రాదు.. సంక్షేమం లేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications