గ్రామజ్యోతి: సీఎం కేసీఆర్ చెప్పిన పిట్టకథ ఇదే (ఫోటోలు)

హైదరాబాద్: ఏదైనా మంచి పని చేయలనుకున్నప్పుడు అడ్డుకునే వాళ్లు ఉంటారని, వారిని అధిగమించి ముందుకు సాగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం ఆయన గ్రామజ్యోతి పథకం ప్రారంభోత్సవ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

తాను చేసిన వ్యాఖ్యలు నిజాలని నిరూపించేందుకు ఓ పిట్టకథ కూడా చెప్పారు. ‘‘రామాయణం గురించి మనందరికీ తెలిసిందే కదా. రావణుడు సీతను ఎత్తుకుపోయినపుడు యుద్ధంలో రాక్షస సైన్యం ముందు వానర సైన్యం నిలవలేకపోయింది. దీంతో సమాలోచన చేసిన వానర సైన్యం ‘రామబాణం తీయాల్సిందే''నని రాముడిని కోరింది.

అయితే రామబాణంతో అంతా చనిపోతారని రాముడు సంశయిస్తుంటే ‘రామబాణం తీయకపోతే సీత మనకు దక్కదు' అని వానర సైన్యం ఆయనపై ఒత్తిడి చేసింది. దీంతో రాముడు రామబాణాన్ని ప్రయోగించాడు. రాక్షస జాతి మొత్తం చనిపోయింది. సీతను తీసుకువెళుతున్న సమయంలో అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులంతా ‘‘మీ రామబాణం వల్లే మాకీ గతి పట్టింది. మా పరిస్థితి ఏమిటి?'' అని నిలదీశారు.

దీంతో ‘‘ఏం ఫరవా లేదు. కలియుగంలో మీరంతా ఊరికి ఒకరో, ఇద్దరో పుడతారు. అప్పుడు జనాన్ని హాయిగా పీక్కు తింటారు'' అని రాముడు వారికి చెప్పారు. ప్రస్తుతం మంచిని వ్యతిరేకించే వారంతా రాక్షస సంతతే'' అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సీఎం సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, కలెక్టర్ వాకాటి కరుణ, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకృష్ణ, కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ, గ్రామసర్పంచ్ ఈట్ల శాంతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు కూసం రాజవౌళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామాలన్నీ గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘గ్రామంలో ఐకమత్యం ఉంది. ఏదైనా సాధించొచ్చు. స్వయం సమృద్ధి గ్రామం కావాలంటే మరికొన్ని కొత్త పథకాలు ప్రారంభించుకోవాల్సి ఉంది' అని గంగదేవిపల్లి గ్రామస్థులను సిఎం సూచించారు. ప్రతి గ్రామం గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుంటే బంగారు తెలంగాణ సాధ్యంకాదా? అని ప్రశ్నించారు.
 గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్


గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. సమాజంలో వ్యక్తులు సూపర్ హిట్ అవుతున్నా, సంఘంలో ఫెయిల్ అవుతున్నామన్నారు. సంఘటితంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. మనకు గొప్ప శక్తి ఉంది. తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్


ఎవరో రావాలని ఏదో చేయాలని ఆలోచించకుండా గ్రామస్థులే గ్రామాల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్‌లో గంగదేవిపల్లి, కరీంనగర్‌లో ముల్కనూరు, నిజామాబాద్‌లో అలంకాపూర్ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. నిజామాబాద్ జిల్లా అలంకాపూర్ గ్రామం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి గాంచిందని, అక్కడి నుంచి పంజాబ్‌కు సీడ్స్‌ను తరలించే స్థాయికి ఎదిగిందన్నారు.

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

అలంకాపూర్ గ్రామాభివృద్ధికి మారుపేరంటూనే, గ్రామంలో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లకు దీటుగా భవనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ముల్కనూరు గ్రామం పాడిపంటలకు ప్రసిద్ధిగాంచిందన్నారు. తాను కూడా గొప్ప రైతునని, తన భూమిలో ఎకరానికి 55 టన్నుల కీరదోస పండించానని చెప్పుకొచ్చారు.
గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామజ్యోతి ప్రారంభోత్సవ సందర్భంగా గ్రామస్థులు తనను 7.88 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారని, అయితే గ్రామానికి 10 కోట్లు మంజూరు చేస్తున్నానని, తక్షణమే నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నిధులు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని, ఈ నిధులతో ఏం చేసుకుంటారో గ్రామస్థులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలన్నారు.

 గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్


అదేవిధంగా మేడపల్లి గ్రామంలోనూ ప్రభుత్వం నుంచి 5 లక్షల నిధులను విడుదల చేయగా ప్రత్యేక నిధులతోపాటు ఈ గ్రామానికి చెందిన యశోద ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన కోటి రూపాయల విరాళంతోపాటు మొత్తం 10 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

 గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్


వచ్చే మార్చి నుండి సాగుకు 9 గంటల పగటి పూట విద్యుత్ అందిస్తామని తెలిపారు. 2018-19 నాటికల్లా విద్యుత్ కోతలులేని రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ లేక రాష్ట్రం అధోగతి పాలవుతుందని అపోహాలు సృష్టించారని, ఆ అపోహాలను పటాపంచలు చేస్తూ విద్యుత్ సమస్యను అధిగమించినట్టు వెల్లడించారు.

 గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

గ్రామాలకు గంగదేవిపల్లి ఆదర్శం: సీఎం కేసీఆర్

రానున్న రెండేళ్లలో వరంగల్‌కు జలకళ సంతరించుకుంటుందని తెలిపారు. తెలంగాణలో గుడుంబా మహమ్మారి సమస్య పీడిస్తుందని, త్వరలోనే దీనికి చరమగీతం పాడుతామన్నారు. ఈ సమస్య వల్ల ఇప్పటికి ప్రతి గ్రామంలో రోజుకు 50మంది మృత్యువాత పడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+