వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ స‌భ బ‌రిలో కేసీఆర్..! ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు త‌ప్ప‌దంటున్న గులాబీ బాస్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : లోక్ స‌భ బ‌రిలో కేసీఆర్..! ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌నున్న గులాబీ బాస్..!

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి ఐనా ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌న‌సు జాత‌య రాజ‌కీయాల‌వైపు తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెబుతున్న గులాబీ దళాధిపతి, చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్న కేసీఆర్‌ దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు లోక్‌సభ బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్‌ సభలో కూడా తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్దం చేసుకున్న‌ట్టు వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేంద్ర రాజకీయాల్లో చురుకుగా ఉండేందుకు కేసీఆర్‌ గత కొద్ది రోజులుగా ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపిలో వైసీపి అధినేత జగన్‌మోహ‌న్ రెడ్డ ఎక్కువ స్థానాల్లో సీట్లు గెలిస్తే వాళ్లతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలని చంద్ర‌శేఖ‌ర్ రావు యోచిస్తున్నారు. అయితే బీజేపీతో తెర వెనుక సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో ఏం చేయబోతున్నారనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రయత్నాలకు మోదీ అడ్డుపడినట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో త‌న మనసులో మాట మాత్రం బయటకు రావడం లేదు.

కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతాకరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా

kcr in lok sabha elections..!! For play crucial role in national politics..!!

హైదరాబాద్‌ స్థానానికి పోటీ పెట్టడం లేదని ప్రకటించిన కేసీఆర్‌ ఇంకా మిగిలిన 16 ఆరు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. కొందరు సిట్టింగ్‌లకు ప్రచారం చేసుకోవాలని గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ నల్గొండ, ఖమ్మం, మొదక్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో ఎక్కడినుంచైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల్లో సాగుతోంది.

English summary
Chandrashekhar Rao is likely to be in the Lok Sabha polls this time. The KCR, which is working towards establishing a federal front, is expected to get in the Lok Sabha for taking it forward. In Karimnagar Public Meeting also made it clear that he would play an active role in national politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X