• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ జాతీయపార్టీ ధమాకా; హమాలీలకు కోడి, క్వార్టర్ విస్కీ పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా సందర్భంగా జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇప్పటికే కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన గురించి తెలంగాణ మంత్రులు సంచలన వ్యాఖ్యలు చూస్తుంటే, తామేమీ తక్కువ కాదన్నట్టుగా కొందరు నాయకులు కూడా కొత్త తరహా ప్రచారానికి తెరతీశారు.

కేసీఆర్ కొత్త పార్టీ ధమాకా.. కోడి, క్వార్టర్ బాటిల్ పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకుడు

కేసీఆర్ కొత్త పార్టీ ధమాకా.. కోడి, క్వార్టర్ బాటిల్ పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకుడు

వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ దసరానాడు జాతీయ పార్టీ ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ టిఆర్ఎస్ నాయకుడు పేద హమాలీలకు ఒక కోడి, క్వార్టర్ విస్కీ బాటిల్ పంపిణీ చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. వరంగల్ నగరానికి చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి చేసిన ఈ పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభ సందర్భంగా కేసీఆర్ కోసం ఆయన చేసిన పనితో స్థానికులు అవాక్కయ్యారు.

కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు చేసిన రాజనాల శ్రీహరి

కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు చేసిన రాజనాల శ్రీహరి

జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షునిగా ఎంపిక కావాలని అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించి, కెసిఆర్ ప్రధానమంత్రి కావాలనే కోరికతో రాజనాల శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెసిఆర్ ప్రధానిగా , రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కేటీఆర్ ఎంపికై, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజనాల శ్రీహరి విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని ఆకాక్షించారు.

200 మండి పేద హమాలీలకు ఒక కోడి, క్వార్టర్ విస్కీ బాటిల్ పంపిణీ

200 మండి పేద హమాలీలకు ఒక కోడి, క్వార్టర్ విస్కీ బాటిల్ పంపిణీ

అనంతరం వరంగల్ చౌరస్తాలో 200 పేద హమాలి లకు ఒక కోడి ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ ని పంపిణీ చేసి కేసీఆర్ పట్ల ఉన్న భక్తిని తెలియజెప్పే ప్రయత్నం చేశారు రాజనాల శ్రీహరి. మొత్తం 200 కోళ్ళు, 200 విస్కీ క్వార్టర్ బాటిళ్ళు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నానని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు.
కెసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు పెట్టి లిక్కర్, కోళ్లు పంపిణీ చేసిన రాజనాల శ్రీహరి ప్రయత్నం బెడిసికొట్టింది.

కేసీఆర్ , కేటీఆర్ ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ నాయకుడు చేసిన పనిపై విమర్శలు

కేసీఆర్ , కేటీఆర్ ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ నాయకుడు చేసిన పనిపై విమర్శలు

ఎవరైనా పేదలకు అన్నదానం చేస్తారు. బట్టలు ఇస్తారు. పండుగ సందర్భంగా కావాలంటే వారికి కావలసిన సరుకులను పంపిణీ చేస్తారు కానీ, కోడి, క్వార్టర్ బాటిల్ సీఎం కేసీఆర్ పేరుమీద పంపిణీ చేస్తారా అని స్థానికులు షాక్ కు గురవుతున్నారు. ఇక ఇది బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి ధమాకా అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై బిజెపి నాయకులు తిట్టిపోస్తున్నారు. యధా రాజా తథా ప్రజా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

 సిగ్గిమాలిన పనులు గులాబీ నేతలకే చెల్లు.. టార్గెట్ చేస్తున్న బీజేపీ

సిగ్గిమాలిన పనులు గులాబీ నేతలకే చెల్లు.. టార్గెట్ చేస్తున్న బీజేపీ

కెసిఆర్ ఫాం హౌస్ లో తాగి పడుకుంటే, జనాలను కూడా అదే మద్యం మత్తులో తూగమని టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాహాటంగా సిగ్గులేకుండా లిక్కర్ పంపిణీ చేస్తున్నారు, అందులో నంజుకు తినడానికి కోళ్లను కూడా పంపిణీ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంత సిగ్గుమాలిన పనులు చేయడం టిఆర్ఎస్ పార్టీ నాయకులకే చెల్లుతుందని విమర్శిస్తున్నారు. ముందు ముందు మరిన్ని అవాక్కయ్యే విషయాలను వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందో అంటూ ఈ విషయం తెలిసిన స్థానికులు కెసిఆర్ జాతీయ పార్టీ విషయంలో నాయకుల తీరుపై చర్చించుకుంటున్నారు.

English summary
Warangal's TRS leader Rajanala Srihari distributed a chicken and a quarter bottle of whiskey as KCR's national party dhamaka on dussehra. Now it has become a controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X