మమతా బెనర్జీ బాటలో కేసీఆర్.. వీల్ చైర్లో ప్రచారం.. వర్కవుట్ అవుతుందా!!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ క్రమంలో కెసిఆర్ ప్రజలలో తనపై సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి, వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ వీల్ చైర్ లోనే ప్రచారం చేశారు. ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. ఇక ఇదే పంధాలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీల్ చైర్ లో ప్రచారాన్ని చేసినట్లయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రజల సానుభూతి కూడా సంపాదించినట్లు ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం.

KCR on the path of Mamata Banerjee.. Campaigning in a wheelchair.. Will it work out!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కెసిఆర్ బాత్రూంలో జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరగగా, డాక్టర్లు శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దికొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

కెసిఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా గాయం మాననప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కెసిఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక అసెంబ్లీకి వీల్ చైర్ లోనే రానున్నారు.

లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్ లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలోలా కెసిఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని వీల్ చైర్ లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది భవిష్యత్తులో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+