వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజుల తర్వాత కెసిఆర్ రికార్డ్: శ్రీవారికి రూ.5 కోట్ల ఆభరణాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాడు ఉద్యమనేతగా మొక్కుకున్నారు. ఆ మొక్కును త్వరలో తీర్చుకోనున్నారు.

తిరుమల శ్రీవారికి మొక్కులు సమర్పించేందుకు కెసిఆర్ త్వరలో తిరుపతి వెళ్లనున్నారు. ఇప్పటికే శ్రీవారికి సమర్పించాల్సిన ఆభరణాలు సిద్ధమయ్యాయి. సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె తయారీ తయారయ్యాయి. వీటి బరువు 19 కిలోలు అని తెలుస్తోంది.

వీటిని కీర్తిలాల్ జ్యువెల్లర్స్ తయారు చేసింది. ఇందుకోసం ఆ జ్యూవెల్లర్స్‌కు రూ.4,97,97,514ను చెల్లించారు. ఈ రెండు స్వర్ణాభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించింది. కమలం నమూనాతో సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె తయారుచేయించింది.

KCR Pledged Rs.5 Crore to Tirupati

రాజుల తర్వాత ఓ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పిస్తూ తెలంగాణ రికార్డుకెక్కనుంది. మొక్కుల నేపథ్యంలో టిటిడిని సంప్రదించి రూ.ఐదు కోట్లను టిటిడి ఖాతాలో జమ చేశారు. తయారీకి టెండర్లు పిలవగా.. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్‌ జ్యువెలర్స్‌ దక్కించుకుంది.

22 క్యారెట్ల స్వచ్ఛతతో గ్రాము రూ.2,611 ధరతో ఆభరణాల తయారీకి టిటిడితో ఒప్పందం చేసుకుంది. 14 కిలోలకు పైగా బరువున్న సాలిగ్రామ హారాన్ని రూ.3,70,76,200, ఐదు పేటల కంఠె తయారీకి నాలుగున్నర కిలోలకు పైగా బరువుతో రూ.1,21,41,150 చొప్పున మొత్తం 18.850 కిలోల బంగారంతో ఆభరణాల తయారీకి రూ.4,92,17,350 చెల్లింపు ఒప్పందం కుదిరింది.

ఆభరణాల తయారీ అనంతరం బరువు పరిశీలించగా సాలిగ్రామహారం 14.924 కిలోలు, ఐదు పేటల కంఠె 4.924 కిలోల బరువు వచ్చింది. రెండు ఆభరణాల బరువు 19.072 కిలోలకు చేరింది. ఒప్పందం కంటే 222.20 గ్రాములు అధిక బరువు ఆభరణాలు తూగాయి. ఆభరణాలు ఖజానాకు చేరిన విషయాన్ని కెసిఆర్‌కు తెలిపారు.

English summary
Telangana CM KCR Pledged Rs.5 Crore to Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X