వారసత్వం: అసంతృప్తి.. హరీష్ రావు పేరు లాగిన మంత్రి కెటిఆర్!
హైదరాబాద్: వారసత్వంపై జరుగుతున్న చర్చ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఇబ్బందిని కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. దీంతో కెసిఆర్ వారసుడు కెటిఆర్ అనే అంశం చర్చకు వచ్చింది.
స్వయంగా కెటిఆర్ సోదరి, ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కెసిఆర్ వారసుడు కెటిఆరేనని, అయితే ఇప్పుడే చర్చ అనవసరమని తేల్చి చెప్పారు. టిఆర్ఎస్‌లో, రాజకీయ వర్గాల్లో వారసుడి పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. జరుగుతోంది.

ఇది కెటిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన తన బావ, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరును ప్రస్తావించారట. వారసత్వం పైన ప్రచారం ఎందుకోనని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
హరీష్ రావు ఎన్నో ఉప ఎన్నికలలో గెలిపించారని, అప్పుడు వారసత్వం పైన ఎలాంటి ప్రచారం జరగలేదని కెటిఆర్ వాపోయారు. గతంలోను మంత్రి హరీష్ రావు పలుమార్లు పార్టీని, పార్టీ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించారన్నారు. ప్రస్తుతం నేను, హరీష్ రావు తమ మంత్రిత్వ శాఖల పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పారు. పని లేనప్పుడు మాత్రమే వారసత్వం గురించి మాట్లాడుతారన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications