హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రావాళ్లూ హైదరాబాదీలే, ఇక వాళ్లిష్టం, సెక్షన్8 పెట్టాలని చూసినా: బాబుపై కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గతంలో పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెక్షన్ పెట్టాలని చూసినా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని, గత పద్దెనిమిది నెలలుగా హైదరాబాదులో ఒక్క సంఘటన అయినా జరిగిందా అని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

బేధభావాలు లేకుండా హైదరాబాదులో ఉండే ప్రజలందర్నీ తెరాస ప్రభుత్వం ఒకేలా చూస్తోందన్నారు. అయినా అభూత కల్పనలు సృష్టించారని, సెక్షన్ పెట్టించాలని ప్రయత్నించారని కెటిఆర్ అన్నారు. గతంలో హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింన విషయం తెలిసిందే.

కెటిఆర్ ఇంకా మాట్లాడుతూ... మరాఠీలు, పంజాబీలు, గుజరాతీలు, ఆంధ్రా వాళ్లు అందరూ హైదరాబాదీలే అన్నారు. తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. అందరినీ ఒకేలా చూస్తామని చెప్పారు. ఇక్కడే ఉంటామనే వాళ్లను రక్షించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు.

KCR says TRS will win GHMC polls

ఆ పనిని ఇప్పటికే చేస్తున్నామన్నారు. ఓట్లు వేసే విషయానికి వస్తే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా హైదరాబాదులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లు గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం అందర్నీ ఒకేలా చూస్తుందన్నారు.

హైదరాబాదులో తాగునీటి సమస్య రాకుండా రెండు రిజర్వాయర్లు నిర్వహిస్తామన్నారు. కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు నిర్మిస్తామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, కాని ఏడాదిలో దానిని అధిగమించామన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలు ఉండవని ఒకరు, సెక్షన్ 8 పెట్టాలని ఒకరు, కరెంట్ ఉండదని మరొకరు చెప్పారని కెటిఆర్ మండిపడ్డారు.

కెటిఆర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో జపనీస్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీలు కేకే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

15,628 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం : సీఎం

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శనివారం మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ ద్వారా 15,628 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

డీఎస్సీ ప్రకటన త్వరలోనే వెలువడుతుందబదబాకం. గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

నీటి పారుదల శాఖలో 108 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో 147 పోస్టులు, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్‌కి 462 పోస్టులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కారుణ్య నియామకాల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

English summary
Telangana CM KCR says TRS will win GHMC polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X