జర్మన్ టెక్నాలజీతో కేసీఆర్ సభ -16న huzurabadలో లక్ష మందితో -సీఎంను కలిసిన గెల్లు -ఈటలపై తిట్లు
తెలంగాణలో దళిత సాధికరత కోసం టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన 'దళిత బంధు' పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16న(సోమవారం నాడు) అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన హుజూరాబాద్ సెగ్మెంట్ లోనే పైలట్ ప్రాజెక్టుగా దళిత బందును అమలు చేస్తోన్న దరిమిలా మండలంలోని శాలపల్లిలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్
అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న టీఆర్ఎస్ మంత్రులు, నేతలు తమ మాజీ సహచరుడు ఈటల రాజేందర్ పై తిట్ల దండకాన్ని పఠిస్తున్నారు. కీలక వివరాలివి..

ఆది నుంచీ అదే సెంటిమెంట్..
సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన 'సింహ గర్జన' సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన 'రైతు బీమా' పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన 'రైతుబంధు' పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న హుజురాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ లాంఛనంగా దళిత బంధును ప్రారంభిస్తారు. ఇందుకు..

కీలక దళిత నేతలకు ఆహ్వానాలు
దళితబంధు పథకం తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, ఈ నెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. దళితబంధుపై గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులకు సీఎం సూచనలు చేశారు. దళిత బందు లబ్ధిదారుల ఎంపిక, నగదు జమ, యూనిట్లను సిద్ధం చేయడం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సభ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని సూచించారు. ప్రారంభోత్సవానికి పలువురు దళిత నేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు..

జర్మన్ టెక్నాలజీతో సీఎం సభ
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో నిర్వహించే దళిత బంధు ప్రారంభోత్సవ సభ అట్టహాసంగా జరగాలని సీఎం ఆదేశించగా, ఈ సభకు కనీసం 1లక్ష మందిని తరలిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళిత బంధు తెచ్చామని కేసీఆర్ ఇదివరకే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో హుజూరాబాద్ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, హుజూరాబాద్ సభకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. గురువారమే సభా ప్రాంగణాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురవొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, సీఎం సభా వేదిక ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొనేలా జర్మన్ టెక్నాలజీతో సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే,

కేసీఆర్‌తో గెల్లు శ్రీనివాస్ భేటీ
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ శుక్రవారం నాడు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడైన గెల్లు.. పార్టీ టికెట్ కేటాయించినందుకుగానూ ముఖ్యమంత్రిని కలిసి, పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. సోమవారం నాటి హుజూరాబాద్ దళిత బంధు సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. బహిష్కృత మంతి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ కు శిష్యుడని పేరుపొందిన గెల్లు శ్రీనివాస్ ఇప్పుడు తన గురువుపైనే పోటీకి దిగుతున్నారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఎప్పుడు జరగనుందనేదానిపై సందిగ్ధత కొనసాగుతున్నది...

పార్టీల భుజాల మీదుగా ఈసీ తూటా
ఈ ఏడాది వేసవిలో కరోనా విలయంలోనూ పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ పై కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈసీ అధికారులపై హత్యకేసు పెట్టాలని జడ్జిలు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ సమయంలో ఈసీకి ప్రభుత్వంగానీ, పార్టీలుగానీ అడగా నిలవలేదు. దీంతో రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, హుజూరాబాద్ సహా పలు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల విషయంలో ఈసీ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలను ఈసీ సేకరిస్తున్నది. రేప్పొద్దున కోర్టుల్లో ఎదురుకాబోయే చిక్కులకు పార్టీలనే బాధ్యులుగా చూపించే ఎత్తుగడను ఈసీ అవలంభిస్తున్నది. పార్టీలన్న ఈనెల 30లోగా తమ అభిప్రాయాలను పంపితే, ఎన్నికలపై మార్గదర్శకాలను రూపొందిస్తామని ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తేదీపై స్పష్టత రాలేదు.. కాగా,

హుజూరాబాద్ సభ తర్వాత కేసీఆర్ బిజీ
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న టీఆర్‌ఎస్ అధిష్టానం.. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం సీఎం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాల పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల సందర్శనపై ప్రణాళికలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు,

ఈటలకు సొంత కులస్తుల షాక్
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ను ఓడించడానికి అధికార టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఇది కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన ఎన్నిక కావడంతో గెలుపు బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ కొడుకైన కేటీఆర్ కు కాకుండా, వ్యూహరచనలో నిపుణుడిగా పేరుపొందిన మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. గడిచిన కొద్ది వారాలుగా హరీశ్ అక్కడే మకాం వేసి ఇంతర మంత్రులతో కలిసి ఉధృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కులస్తులైన ముదిరాజ్ లు భారీ ఎత్తున టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ముదిరాజ్ లు ఓటేస్తారంటూ ఈ మేరకు తమ మద్దతు లేఖ అందజేశారు. జమ్మికుంటలో జరిగిన దళిత బంధు అవగాహన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తరతరాలుగా వెనుకబడి, వివక్షకు గురైన దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారని, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అటు,

సీఎం సీటుపై కన్ను.. అందుకే ఈటలపై వేటు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం నాడు కమలాపూర్‌లోని ఖాసీంపల్లిలో ఏర్పాటు చేసిన తుర్క కాశ ముస్లింల ఆత్మీయ సమ్మేళనానంలో పాల్గొన్నారు. రాబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడికే లాభమని, అదే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ప్రజలందరికీ లాభం జరుగుతుందన్నారు. ఈటల రాజేందర్ అధికార పార్టీలో ఉండి తప్పుడు పనులు చేశారని, పదవులు రాగానే అడ్డదారులు తొక్కుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటూ.. అంతస్తులు పెంచుకుంటూ పోయాడని, ముఖ్యమంత్రి కుర్చీ మీదనే కన్నేసిన ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని, మంత్రిగా ఉంటూ కబ్జాలకు పాల్పడ్డాడని, కాబట్టే ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ వేటేశారని బాల్క సుమన్ చెప్పారు. హుజూరాబాద్ లో జరిగిన మరో కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం హర్షణీయమన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. దళిత బంధు సభకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications