విద్యార్థులను వెనక్కి పంపొద్దని కోరాం: కెటిఆర్ లేఖకు సుష్మా రిప్లై
హైదరాబాద్: అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోరే భారత విద్యార్థులు వాటి గురించిన వివరాలను సేకరించి జాగ్రత్త పడాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జ
నవరి 6న తెలుగు విద్యార్థులు కొందరని అమెరికా అధికారులు వెనక్కి పంపడంపై తెలంగాణ మంత్రి కెటి రామారావు రాసిన లేఖకు సుష్మాస్వరాజ్ గురువారం సమాధానం ఇచ్చారు. విద్యార్థులను వెనక్కి పంపడంపై అమెరికా అధికారులతో సంప్రదిస్తున్నామని ఆమె తెలిపారు. చట్టబద్ధంగా వీసాలు కలిగిన వారిని వెనక్కి పంపించవద్దని కోరినట్లు వివరించారు.

విద్యార్థులకు విమానాశ్రయంలో ఎదురైన ఇబ్బందులపై అమెరికా అధికారులు విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఇకపై తనిఖీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తామంటూ హామీ ఇచ్చారని సుష్మా చెప్పారు. విద్యార్థుల కోసం ఇప్పటికే విదేశాంగ తరపున రెండు సార్లు తగిన సూచనలను విడుదల చేశామని తెలిపారు.
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు కోర్సులు, విద్యాసంస్థల విషయంలో ఏమైనా అనుమానాలుంటే దేశంలో ఉన్న ఏడు సహాయకేంద్రాల్లో అమెరికా అధికారులను కలుసుకోవచ్చునని తెలిపారు.












Click it and Unblock the Notifications