40 లక్షల టన్నుల బొగ్గు మాయం: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గుండెకాయ వంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) పరిధిలో బొగ్గు నిల్వలకు సంబంధించి భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో నిల్వ ఉన్న బొగ్గు లెక్కలు సరిపోలడం లేదని, అక్కడ ఉద్దేశపూర్వకంగానే మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై త్వరగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సింగరేణి పరిధిలోని పరిణామాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంస్థలోని బొగ్గు నిల్వల జవాబుదారీతనం విషయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కొంతకాలంగా వస్తున్న ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిజా నిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి నిజాలు బయటకు రాకపోతే సంస్థ ఉనికికే ప్రమాదమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

సింగరేణి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన

ఒకవేళ ఈ అక్రమాలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి, తగిన నివారణ చర్యలు తీసుకోకపోతే సింగరేణి కాలరీస్ సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. సింగరేణి కేవలం విద్యుత్ రంగానికే కాకుండా, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, వేలాది మంది స్థానిక కార్మికుల ఉపాధికి ప్రధాన ఆధారం. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో జరుగుతున్న ఇటువంటి మోసాలు దాన్ని క్రమంగా బలహీనపరుస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బొగ్గు తవ్వకాలు మరియు రవాణా ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు భారీగా అక్రమ లబ్ధి పొందుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ రకమైన అవినీతి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే కాకుండా, సింగరేణి విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపించి, తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన కేంద్ర బొగ్గు మంత్రిగా కోరుతున్నట్లు తెలిపారు.

KishanReddy Writes Strong Letter to CM Revanth Reddy on Major Irregularities in Singareni Coal news

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సింగరేణిలో బొగ్గు నిల్వల అదృశ్యానికి గల కారణాలపై ప్రభుత్వం స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని కార్మిక సంఘాలు కూడా అంటున్నాయి. ప్రజా శ్రేయస్సు, ప్రభుత్వ సొత్తు రక్షణ దృష్ట్యా ప్రభుత్వం పారదర్శకమైన విచారణకు ఆదేశిస్తుందా..? లేదా..? అనే అంశంపై ఇప్పుడు అందిరి దృష్టి కేంద్రీకృతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+