పార్టీ ఫిరాయింపులు: కెసిఆర్‌కు కోదండరామ్ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఝలక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల పైన కోదండరామ్ అధికార టిఆర్ఎస్ పార్టీకి చురకలు అంటించారు.
కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలను తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినా అది తప్పే అవుతుందని చెప్పారు. ఇటీవల తెరాసలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు వస్తున్నాయి. దానిని ఉద్దేశించి కోదండరామ్ వ్యాఖ్యానించారని చెప్పవచ్చు.

పార్టీల మధ్య జరిగే రాజకీయ వివాదాల జోలికి మేం వెళ్లదల్చుకోలేదని చెప్పారు. ఓ పార్టీని వదిలి వెళ్లిపోవడం లాంటివి అస్థిరతకు దారి తీస్తాయన్నారు. రైతుల ఆత్మహత్య నివారణకు కళాకారులు పాటలు పాడాలని కోదండ విజ్ఞప్తి చేశారు.
గ్రూప్ డీ, బ్యాంకు ఉద్యోగుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. త్వరలో జెఏసీ విస్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాష్టాలు కూడా (ఏపీ, తెలంగాణ)లు సఖ్యతతో మెలగాలని కోదండరామ్ ఆకాంక్షించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications