ఎకరం రూ.137.25 కోట్లు.. హైదరాబాద్ లో రికార్డు బద్దలు..
హైదరాబాద్ లోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ. 137 కోట్ల 25 లక్షలు పలికింది. నియోపోలిస్ లో ఉన్న ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు.. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. అయితే సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. హెచ్ ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్ లైన్ వేదికగా వేలం వేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ శివారులోని కోకాపేటలో మరోసారి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం ధర అత్యధికంగా రూ.137 కోట్ల 25 లక్షలు పలికింది. ఆ ప్రాంతంలోని నియోపోలిస్ లో ఉన్న సర్వే నెంబర్ 17,18 లోని భూములకు HMDA అధికారులు వేలం నిర్వహించారు. అయితే సర్వే నెంబర్ 17 లోని ఎకరం భూమి ధర ఏకంగా రూ.137 కోట్ల 25 లక్షలు పలికింది. హైదరాబాద్ చరిత్రలోనే ఇది రికార్డని చెబుతున్నారు. ఇక హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములను వేలం వేసేందుకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
కోకాపేటలోని నియోపోలిస్ లో సర్వే నంబర్ 17, 18 లో ఉన్న భూములకు వేలం నిర్వహించిన HMDA అధికారులు అక్కడ ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు.. అది అత్యధికంగా రూ.137.25 కోట్లు పలికింది. సర్వే నంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా.. సర్వే నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉన్నాయి. ఇక మొత్తానికి సోమవారం జరిగిన భూమి వేలంతో 9.90 ఎకరాలకు గానీ హెచ్ ఎండీఏకు భారీగా రూ. 1,355.33 కోట్లు ఆదాయం వచ్చింది.

ఇక ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ వేలంపాట నిర్వహించిన విషయం తెలిసిందే. 7.67 ఎకరాలకు వేలంపాట నిర్వహించగా.. రూ.1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. రాయదుర్గంలో కనీస ధర ఎకరాకు రూ. 101 కోట్లుగా ఉండగా.. వేలంలో రూ. 177 కోట్లు పలికింది.












Click it and Unblock the Notifications