మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు.. కానీ కలవరపడుతున్న బీజేపీ.. ఎందుకంటే!!

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. హోరా హోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి. మునుగోడులో ప్రచార పర్వంలో బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో తనదైన శైలిలో దూకుడును కొనసాగిస్తున్నాడు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 మునుగోడులో బీజేపీకి కొత్త టెన్షన్

మునుగోడులో బీజేపీకి కొత్త టెన్షన్

కానీ మునుగోడు లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన బిజెపిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు అనేక సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తు మీద గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు విషయంలో ఓటు వేసే సమయంలో ఓటర్లు అయోమయానికి గురి అవుతారేమో అన్న ఆలోచన బీజేపీ నేతలను కలవరపెడుతుంది.

రాజగోపాల్ రెడ్డి గుర్తుపై ఓటర్లు అయోమయానికి గురైతే ఎలా?

రాజగోపాల్ రెడ్డి గుర్తుపై ఓటర్లు అయోమయానికి గురైతే ఎలా?

మునుగోడు నియోజకవర్గంలో తాజా పరిస్థితులు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరు బలం గా గ్రామస్థాయిలో వినిపిస్తుందని బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, ఓటర్లు రాజగోపాల్ రెడ్డి గుర్తు హస్తం గుర్తు అని చెయ్యికి ఓటేస్తే ఊహించని దెబ్బ తగులుతుందని బిజెపి ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికి కమలం గుర్తు పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.

157 గ్రామాలలో ఇల్లిల్లూ తిరుగుతూ కమలం గుర్తుపై విస్తృత ప్రచారం

157 గ్రామాలలో ఇల్లిల్లూ తిరుగుతూ కమలం గుర్తుపై విస్తృత ప్రచారం

నేటి నుంచి గడపగడపకు కమలం గుర్తుని తీసుకు వెళ్లే ఆలోచనలో బిజెపి ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతుంది. 157 గ్రామాలలో ఇల్లిల్లూ తిరుగుతూ కమలం గుర్తు పై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. బూత్ ఇన్చార్జ్ లతో మీటింగ్ పెట్టిన తర్వాత తమ ప్రచార సరళిని పూర్తిగా మార్చుకున్న బీజేపీ నేతలు నేటి నుంచి కమలం గుర్తు పై ఫోకస్ పెట్టి ప్రచారం చేయనున్నారు. చాలా ఏళ్ళపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వల్ల చాలామంది వృద్ధులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అని భావిస్తున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాలలో కోమటిరెడ్డి గుర్తు కమలం అని తెలిసేలా ప్లాన్

గ్రామీణ ప్రాంతాలలో కోమటిరెడ్డి గుర్తు కమలం అని తెలిసేలా ప్లాన్


ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో గుర్తు మారింది అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతంలో కమలం సింబల్ కనిపించేలా పెద్దపెద్ద బ్రోచర్లు, పంపిణీ చేయాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. కమలం గుర్తు ఉన్న ప్లకార్డులు, పోస్టర్లతో పార్టీ గుర్తును ప్రధానంగా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+