వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా?

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇద్దరూ రాజకీయాల్లో తలపండినవారే. కానీ అంతటి నేతలు కూడా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయలేకపోయారు. చివరకు తాము చేసిన రాజకీయం బెడిసికొట్టడంతో ఏంచేయాలో పాలుపోని స్థితికి వెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న వారి ఆధిపత్యానికి బీటలు వారాయి.

రాజకీయంగా గడ్డు పరిస్థితి?

రాజకీయంగా గడ్డు పరిస్థితి?

ప్రస్తుతం ఈ సోదరులిద్దరూ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, మోడీ చరిష్మా కలిసివస్తుందనే అంచనాతో రాజీనామా సమర్పించి బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డికి నిరాశే ఎదురైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సోదరుడి విజయం కోసం తమను కొన్నేళ్లుగా మోస్తున్న కాంగ్రెస్ పార్టీని, పార్టీలో తన పలుకుబడిని పణంగా పెట్టినా అనుకున్న ఫలితం దక్కలేదు. మరోవైపు ఎన్నికలకు ముందు తన సోదరుడికి మద్దతుగా మాట్లాడిన ఆడియో బయటకు రావడం.. అందులో కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేస్తూ మాట్లాడినవి.. ఇతరత్రా అనేక అంశాలు ఉండటంతో అధిష్టానం షోకాజ్ జారీచేసింది.

సంతృప్తి చెందని అధిష్టానం?

సంతృప్తి చెందని అధిష్టానం?

షోకాజ్ నోటీసుకు ఆయనిచ్చిన సమాధానంతో అధిష్టానం సంతృప్తి చెందలేదని, పార్టీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటాన్ని సీరియస్ గా తీసుకుందని, వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కి కూడా బీజేపీలో అనుకున్నస్థాయిలో ప్రాధాన్యత దక్కే అవకాశం కనపడటంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గెలిచివుంటే పార్టీ బలంకన్నా ఆయన సొంతబలంపై గెలిచినట్లుగా చెప్పుకోవడానికి అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోయిందంటున్నారు.

ఇప్పటివరకు ఉన్న ప్రాధాన్యం ఇకనుంచి ఉండదేమో..

ఇప్పటివరకు ఉన్న ప్రాధాన్యం ఇకనుంచి ఉండదేమో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు తమకు ఎదురులేదని చెబుతున్న ఈ సోదరులిద్దరికీ మునుగోడు ఉప ఎన్నిక కోలుకోలేని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్నట్లుగా భవిష్యత్తు మారుతుందంటున్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారినా, అప్పుడు ఇప్పుడున్నంత ప్రాధాన్యత దక్కకపోవచ్చని, అధిష్టానానికి ఆయనిచ్చిన సమాధానం కూడా సంతృప్తి పరచలేదని సమాచారం.

ఒకవేళ వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా ఇప్పటివరకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చంటున్నారు. ఏదేమైనప్పటికీ కోమటిరెడ్డి సోదరులిద్దరూ రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. దీన్ని వారు ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సి ఉంది.!

English summary
It has always been Nanu's belief that there are no murders in politics, only suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X