కేసీఆర్‌ను జైల్లో పెట్టడమే లక్ష్యం, ఫ్యామిలీ అవినీతిపై సీబీఐకి: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని జైలులో పెట్టించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం అన్నారు.
కేసీఆర్ కుటుంబం అవినీతిపై సీబీఐ, ఈడీ, సీఈసీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణలో కులాల వారీగా విడదీస్తూ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తమ ఇద్దరి సభ్యత్వం ఎలా రద్దు చేస్తారని ఎలా ప్రశ్నించారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటకు రాడని చెప్పారు. కుర్చీలో నుంచి లేవలేని కేసీఆర్‌కు థర్డ్ ఫ్రంట్ అవసరమా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications