వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసైడ్ అయ్యారా - వెంటాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం అంతుచిక్కటం లేదు. ఇప్పటికే వెంకరెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా.. ఆయన మాత్రం డోన్ట్ కేర్ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు బై పోల్ లో పోటీ చేసారు. మునుగోడు వెంకటరెడ్డి పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ తరపున మునుగోడులో ప్రచారంలో పాల్గొన లేదు. అదే సమయంలో ఒక ఆడియో కాల్ లో పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసి తమ్ముడు రాజగోపాల్ గెలుపుకు సహకరించాలని కోరారు.

 నోటీసులకు స్పందించని వెంకటరెడ్డి

నోటీసులకు స్పందించని వెంకటరెడ్డి


ఆ వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిన వెంకటరెడ్డి అక్కడ కూడా ఇదే రకంగా వ్యాఖ్యలు చేసారు. మునుగోడులో రాజగోపాల్ గెలుస్తారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ -బీజేపీ డబ్బు పెడుతున్నాయని, ఓడిపోయే పార్టీ కోసం ప్రచారం ఎందుకని వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డి ఆడియో వైరల్ కావటంతో, దీని పైన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 22న నోటీసు జారీ చేస్తూ, ఆడియో కాల్ లో చేసిన వ్యాఖ్యల పైన వివరణ కోరింది. ఎందుకు పార్టీ క్రమ శిక్షణా చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. దనికి పది రోజుల సమయం పేర్కొంది. ఆ సమయం ఈ నెల 1వ తేదీతో ముగిసింది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఆ నోటీసుకు వివరణ ఇవ్వలేదని పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం.

రాహుల్ జోడో యాత్రకు దూరంగా

రాహుల్ జోడో యాత్రకు దూరంగా


ఇక, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంకటరెడ్డి ఇప్పటి వరకు రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోనే కొనసాగుతున్నా..అందులో పాల్గొన లేదు. దీంతో, అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి పైన పార్టీలో చర్చ మొదలైంది. అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగే ఉద్దేశంతో ఉన్నారా లేదా తమ్ముడి బాట పడుతారా అంటూ పార్టీలో కొందరు నేతలు అంతర్గత చర్చల్లో సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో పార్టీ క్రమశిక్షణా సంఘం మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈ నటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నోటీసుకు సమాధానం రాకుంటే, వెంకటరెడ్డి పైన చర్యలకు అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

క్రమశిక్షణా సంఘం మరోసారి నోటీసులు

క్రమశిక్షణా సంఘం మరోసారి నోటీసులు


మునుగోడు ఉప ఎన్నిక ముగియటం..ఈ నెల 6వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఫలితాలు రాజగోపాల్ కు అనుకూలంగా ఉంటే వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫలితం ప్రతికూలంగా ఉంటే, వెంకటరెడ్డి ఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత వివాదం పరిష్కరించుకొనే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నోటీసుల విషయంలో ఏ రకంగా స్పందిస్తారు..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Congress MP Komatireddy Venkata Reddy has been served another show cause notice by the AICC Diciplinary action committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X