సురేఖకు ఢిల్లీ పిలుపు, రేవంత్ కంటే ముందే భేటీ- అనూహ్య నిర్ణయం..!!
కొండా సురేఖ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో సురేఖ పైన నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు. పార్టీ నాయకత్వం క్రమిశిక్షణా సంఘం చేసిన సిఫారసు మీద నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే, అనూహ్యంగా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేవంత్ కంటే ముందే పార్టీ హై కమాండ్ తో భేటీ కానున్నారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారు. తాజా వివాదం వేళ పార్టీ క్రమశిక్షణా సంఘం కొండా పైన వేటు వేయాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనతో నిర్ణయం ఆలస్యం అయింది. ఆయన విదేశాల నుంచి రావటంతో కొండా సురేఖ నేరుగా ఆయన ఆప్పాయింట్ మెంట్ కోరారు. ఢిల్లీ రావాలని సూచించటంతో వెంటనే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో రేవంత్ సైతం ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి హస్తిన కు వెళ్లనున్నారు. రేవంత్ ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంలో తొలి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు.. తన వివరణ లేఖ.. తాజా పరిస్థితుల పైన చర్చించే అవకాశం ఉందని సమాచారం.

హైకమాండ్ నిర్ణయం వేళ
కాగా, అటు రేవంత్ మద్దతుగా నిలుస్తున్న నేతలు మాత్రం సురేఖతో పాటుగా చిన్నారెడ్డి పైనా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు లేఖలు రాసారు. ఇక.. రేవంత్ సైతం తన వాదన పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసారు. చర్యలు తీసుకోకుంటే పార్టీలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని సూచిస్తున్నారు. ఇక.. సురేఖ పైన నేరుగా వేటు వేయకపోయినా.. మంత్రి వర్గ విస్తరణ ద్వారా తప్పించాలనేది మరో ఆలోచనగా ఉంది. అయితే.. సురేఖ తో రాజీనామా చేయించే ఆలోచన పైనా కసరత్తు జరుగుతోంది. కాగా.. ఇప్పుడు సురేఖ నేరుగా కేసీ వేణుగోపాల్ తో చర్చ సమయంలో ఇచ్చే వివరణ ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, ఈ సాయంత్రానికి సురేఖ వ్యవహారంలో పార్టీ నాయకత్వం చర్యల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications